స్కంద ఎక్స్ ట్రా మాస్ చూపించారు

గత నెల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వదిలిన థియేట్రికల్ ట్రైలర్ మీద కొంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో దాన్ని సీరియస్ గా పరిగణనలోకి తీసుకున్న స్కంద టీమ్ ఇవాళ కరీంనగర్ లో జరిగిన కల్ట్ జాతర వేడుకలో కొత్త వెర్షన్ ని విడుదల చేసింది. ఇంకో మూడే రోజుల్లో రామ్ సందడి చేయనున్న నేపథ్యంలో హైప్ పెంచే పనిలో భాగంగా ఇంటర్వ్యూల స్పీడ్ కూడా పెంచారు. నిజానికి ఫ్యామిలీ అంశాలు ఎక్కువగా జోడించి కొత్త ట్రైలర్ ని కట్ చేశారని వినిపించింది కానీ మనం ఊహించిన దానికన్నా మాస్ ఎక్కువ స్థాయిలో ఉందని చెప్పేందుకు నిమిషంన్నర ప్యాకేజ్ అందించారు.

స్కందలో రామ్ రెండు షేడ్స్ ఉంటాయనే విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. కాలేజీలో స్టూడెంట్ గా చూపించినా అక్కడ ఊర మాస్ బాడీ లాంగ్వేజ్ తో రెచ్చిపోగా, అసలైన విశ్వరూపం ఎర్రమట్టి టోన్ లో  లుక్కు, హెయిర్ స్టైల్ ని మార్చుకుని చూపించిన మరో యాంగిల్ లో సరైనోడు, అఖండ, లెజెండ్ రేంజ్ ఎలివేషన్ దట్టించాడు దర్శకుడు బోయపాటి శీను. ఆయన ట్రేడ్ మార్క్ ఫ్యామిలీ డ్రామా, క్లోజప్ లో బిల్డప్స్, సవాళ్లు ప్రతిసవాళ్లు అన్నీ కొలతేసినట్టు పక్కాగా ఉన్నాయి. ఆశించినట్టే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడింది.

ఇదంతా కాసేపు పక్కనపెడితే ఇప్పుడీ కొత్త ట్రైలర్ వల్ల అమాంతం అభిప్రాయం మారిపోలేదు కానీ మాస్ వర్గాల్లో చూడాలనే ఆసక్తి పెంచడంలో మాత్రం సక్సెస్ అయినట్టు అనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ ని మించిన మాస్ అయితే ఇందులో రామ్ చూపించబోతున్నాడు. అయితే ట్రైలర్లలో ఎక్కడా శ్రీలీలను, తనతో రామ్ చేసిన డాన్సులను హైలైట్ చేయకపోవడం గమనించాల్సిన విషయం. ఈ కాంబో ఎనర్జీ స్క్రీన్ మీద ఏ రేంజ్ లో ఉంటుందోననే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే ఆ అంశాన్ని సైడ్ ట్రాక్ చేసి రామ్ కమర్షియల్ ప్యాకేజీగానే స్కందను మార్కెట్ చేస్తుండటం విశేషం