కళ్యాణ్ కృష్ణ కలలకు మెహర్ అడ్డుకట్ట

ఒకవేళ భోళా శంకర్ కనక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఈపాటికి మెగా 156 దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో మొదలైపోయి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకునుండేది. కానీ మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ గా నిలిచిపోవడం చిరంజీవిని బాగా కలచివేసిన మాట వాస్తవం. తన రేంజ్ కి ఎంతమాత్రం సరితూగని కిందిస్థాయి ట్రోలింగ్ ని ఓటిటి రిలీజ్ తర్వాత ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి వచ్చింది. దీంతో ఈ దెబ్బ నేరుగా స్క్రిప్ట్ తో సహా మొత్తం సిద్ధం చేసి పెట్టుకున్న కళ్యాణ్ కృష్ణ బృందం మీద పడింది. అసలే దాని మీద బ్రో డాడీ ఫ్రీమేకనే ప్రచారం విపరీతంగా జరిగి స్టార్ట్ కాక ముందే నెగటివిటీ వచ్చేసింది.

దీంతో ఎంతమాత్రం రిస్క్ చేయకూడదని భావించిన చిరు దాని స్థానంలో ఇప్పుడు వసిష్ఠ ఫాంటసీ మూవీని ముందుకు తెచ్చారు. దానికి సంబంధించిన డిస్కషన్లు, స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. యువి క్రియేషన్స్ ప్రీ ప్రొడక్షన్ ని వేగవంతం చేసింది. ఇదంతా చూస్తుంటే చిరు నెంబర్ మారినట్టే అనిపిస్తోంది. దీంతో ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ మళ్ళీ కొత్త కథ రాసుకుంటారా లేక అభిమానులను జస్ట్ డైవర్ట్ చేయడానికి అలా పెండింగ్ లో ఉంచినట్టు ఫీలర్స్ వదిలారా అనేది తెలియాల్సి ఉంది. ప్రసన్న కుమార్ చెప్పగానే చిరంజీవి ఓకే చేసిన కథ ఇది. అంత హఠాత్తుగా నిర్ణయాలు మారడం విచిత్రమే.

ఒకరకంగా చెప్పాలంటే కల్యాణ కృష్ణ కలలకు మెహర్ రమేష్ బ్రేక్ వేశాడు. ఫామ్ లో ఉన్న దర్శకులతోనే పనిచేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో చిరంజీవి సీరియస్ గానే ఆ దిశగా ఆలోచిస్తున్నారట. జైలర్ కథను నెల్సన్ దిలీప్ కుమార్ ముందు తనకే చెప్పినప్పుడు అందులో సత్తాని పసిగట్టలేకపోవడం ఎంత పొరపాటో అవగతమైంది. శ్రీముఖి నడుముని కవ్వించడం కన్నా మనవడి మీద హత్య ప్రయత్నం చేసిన వాడి తల నరకడానికే మాస్ కనెక్ట్ అవుతున్నారని అర్థమైనట్టు ఉంది. సో మెగా 157 నెంబర్ మారి కళ్యాణ కృష్ణది ఇంకొంత ఆలస్యం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు