ట్విట్టర్లో టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఐతే ముందుకొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్లు.. ఎన్నో ఏళ్లుగా ఉన్న యువ కథానాయకుల కంటే ఈ ఏడాది మార్చిలో ట్విట్టర్లోకి అడుగు పెట్టిన చిరంజీవే చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తరచుగా ట్వీట్లు వేస్తూ అభిమానుల్ని సంతోషపెడుతున్నారు. ఆ ట్వీట్లు కూడా మొక్కుబడిగా ఏమీ ఉండట్లేదు.
చిరు చమత్కారాన్ని, ఉత్సాహాన్ని, సామాజిక బాధ్యతను, సేవా భావాన్ని చాటేవిగా ఉంటున్నాయి. ఐతే ట్విట్టర్లో చిరు ఉత్సాహం చూసి చాలామందికి ఒక సందేహం కలిగింది. ఈ ట్విట్టర్ హ్యాండిల్‌ను ఆయన స్వయంగా మెయింటైన్ చేయట్లేదని.. దీని నిర్వహణ కోసం ఒకరిద్దరితో టీంను పెట్టుకుని ఉండొచ్చని చాలామంది అన్నారు. ఐతే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాత్రం అలాంటిదేమీ లేదంటున్నాడు. చిరు సొంతంగానే తన ట్విట్టర్ అకౌంట్‌ను మేనేజ్ చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
“నాన్నగారు ట్విట్టర్లోకి రాబోతుండగానే ‘బీ అవేర్ చరణ్. ఐయామ్ కమింగ్ హియర్’ అని నాతో అన్నారు. ఆ తరం వాళ్లకి సంబంధించిన వ్యక్తిగత విషయాల గురించి మనకు పెద్దగా తెలియదు. వారికి చెప్పే అవకాశమూ రాలేదు. అయితే ఇప్పుడు ఆ అవకాశం రావడంతో నాన్న గారు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాంటి మేనేజర్ లేకుండా నేరుగా ఆయనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.
లాక్ డౌన్‌లో ఆయన ట్వీట్లతో అభిమానులు కూడా బాగానే ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఇక సోషల్ మీడియాలో ఆయన నన్ను డామినేట్ చేస్తున్నారన్న ఫీలింగ్ ఎంతమాత్రం లేదు. సైలెంటుగా ఉండటంలో నాన్న గారికి కంఫర్ట్ అనిపించదు. అలా ఉండటానికి ఇబ్బంది పడతారు. నేను నాన్న లాగా ఎక్కువ మాట్లాడితే నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో నా కంఫర్ట్‌లో నేనుంటున్నాను. నాన్న గారి ట్వీట్లను మాత్రం అభిమానుల్లాగే నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా” అని చరణ్ తెలిపాడు.
This post was last modified on August 23, 2020 3:30 pm
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్‌సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…