ఈ ఏడాది లాస్ట్ క్వార్టర్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో ‘లియో’ ఒకటి. తమిళ టాప్ స్టార్ విజయ్ ప్రధాన పాత్రలో.. ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్న సినిమా కావడం.. సంజయ్ దత్, అర్జున్ ఇలా చాలామంది అగ్ర నటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో ఈ సిినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉండగా.. తెలుగులో కూడా హైప్ బాగానే క్రియేట్ అయింది.
తన తొలి చిత్రం నుంచి డ్రగ్ మాఫియా చుట్టూనే కథలు నడుపుతూ.. ఒక సినిమాతో ఇంకో సినిమాకు లింక్ పెడుతుండటం ప్రేక్షకుల్లో ‘లియో’పై మరింత అంచనాలను పెంచుతోంది. ‘లియో’ కథ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. కాగా ఈ సినిమా పోస్టర్లను కూడా ఒక పద్ధతి ప్రకారం.. ఒక కాన్సెప్ట్‌ను అనుసరిస్తూ రిలీజ్ చేస్తుండటం విశేషం.
కొన్ని రోజుల కిందట ‘‘కీప్ కామ్.. అవాయిడ్ ద బ్యాటిల్’ అనే క్యాప్షన్‌తో ఒక పోస్టర్ వదిలారు. అందులో విజయ్ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. మంచు పర్వతాల బ్యాక్ డ్రాప్‌లో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. తర్వాతేమో ‘‘కీప్ కామ్.. ప్లాయ్ ద ఎస్కేప్’’ అంటూ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో విజయ్ తీవ్రంగా ఆలోచిస్తూ కనిపించాడు”.. ఇక లేటెస్ట్‌గా ‘‘కీప్ కామ్.. రెడీ ఫర్ ద బ్యాటిల్” అంటూ ఫైర్ బ్యాక్‌డ్రాప్‌లో విజయ్‌ని చూపిస్తూ అతను గన్ను రెడీ చేసుకుంటున్న దృశ్యం పెట్టారు.
ఈ పోస్టర్లలో క్యాప్షన్లను కనెక్ట్ చేసి చూసుకుంటే హీరో పాత్ర, కథ మీద ఒక ఐడియా వస్తుంది. ముందు హీరో గొడవలకు దూరంగా ప్రశాంతంగా గడుపుతుంటాడు. తర్వాత ప్రత్యర్థులు తనను టార్గెట్ చేసినా.. తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక తప్పదు అనుకున్నాక యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇక చివరి పోస్టర్లో ‘‘డోంట్ బి కామ్.. డు ద బ్యాటిల్’’ తరహా క్యాప్షన్ పెట్టి హీరో విశ్వరూపాన్ని లోకేష్ ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాడేమో అనిపిస్తోంది. ఇలా ఒక కాన్సెప్ట్‌తో స్టార్ హీరో సినిమాలకు పోస్టర్లు వదలడం అరుదైన విషయమనే చెప్పాలి.