సినిమా డైరెక్టరంటే ఒకే తరహా సిగ్నేచర్‍కి అలవాటు పడిపోకూడదు. స్టీవెన్ స్పీల్‍బర్గ్, క్రిస్టఫర్ నోలాన్ తదితర దిగ్దర్శకులు ఎప్పుడూ ఒకే తరహా జోనర్‍కి కట్టుబడలేదు. కానీ తెలుగు చిత్ర సీమలో చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే సినిమా, సినిమాకూ మధ్య వ్యత్యాసం చూపిస్తారు.
బాగా సక్సెస్ అయిన డైరెక్టర్లంతా తమ జోన్ లోంచి బయటకు రావడానికి జంకుతుంటారు. రాజమౌళి గతంలో మాస్ సినిమాలు, ఇప్పుడు లార్జ్ స్కేల్ సినిమాలు తీస్తున్నాడు. త్రివిక్రమ్ పూర్తిగా ఫ్యామిలీ డ్రామాలకు కట్టుబడిపోయాడు. కొరటాల శివ సోషల్ మెసేజ్ వున్న సీరియస్ సినిమాలు తీస్తుంటాడు. బోయపాటి శ్రీను ఘాటెక్కిపోయే మసాలా సినిమాలకు పెట్టింది పేరు. సుకుమార్ ఒక్కడే ఒకే తరహా కథలకు కట్టుబడిపోకుండా జాగ్రత్త పడుతుంటాడు. అయితే అతని సినిమాలలో కూడా ప్రధానంగా రివెంజ్ థీమ్ కనిపిస్తుంటుంది.
తెలుగు సినిమా దర్శకులలో ఇప్పుడు ఆల్‍రౌండర్ ఎవరయినా వుంటే అది క్రిష్ మాత్రమే అనాలి. ప్రతి సినిమాకూ భిన్నమైన నేపథ్యం తీసుకుని కొత్త రకం కథలు చెప్పాలని తాపత్రయపడుతుంటాడు. గౌతమిపుత్ర శాతకర్ణిని మనకు పరిచయం చేసిన క్రిష్ త్వరలో పవన్‍కళ్యాణ్‍తో ఒక జానపద చిత్రాన్ని చూపించబోతున్నాడు.
ఈలోగా జంగిల్ బుక్ తరహాలో వైష్ణవ్ తేజ్‍తో ఒక సినిమా తీస్తున్నాడు. ప్రతి దర్శకుడికీ ఒక కంఫర్ట్ జోన్ వుంటే ఇక కొత్త కథలకు ఆస్కారముండదు. కనీసం క్రిష్ అయినా ఒక జోనర్‍కి ఫిక్స్ కాకపోవడం తెలుగు సినీ ప్రియులకు ఊరటనిచ్చే విషయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates