మనకు ఎస్ జె సూర్యతో ఉన్న కనెక్షన్ విచిత్రమైనది. పవన్ కళ్యాణ్ కి ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడిగా గౌరవమివ్వాలో లేక మహేష్ బాబుకి నాని లాంటి అల్ట్రా డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గా గుర్తు చేసుకుని మరీ తిట్టుకోవాలో అర్థం కాదు. ఇదే కాదు స్పైడర్ లో విలన్ గా ఎంత విశ్వరూపం చూపించినా దాని ఫలితం మనకు దూరం చేసిన మాట వాస్తవం. టెక్నికల్ గా ఇతని పనితనం కాసేపు పక్కనపెడితే నటుడిగా ఎస్జె సూర్యలో చాలా విలక్షణత ఉన్న మాట వాస్తవం. సరైన సబ్జెక్టు, కథ దొరికితే ఏ స్థాయిలో చెలరేగిపోతాడో నిన్న రిలీజైన మార్క్ ఆంటోనీకి వచ్చిన స్పందన తేటతెల్లం చేస్తోంది.
కామెడీ ప్లస్ సీరియస్ నెస్ కలగలసిన విలన్ గా డ్యూయల్ రోల్ లో ఎస్జె సూర్య పెర్ఫార్మన్స్ చూస్తే విశాల్ ని పూర్తిగా డామినేట్ చేశాడనేది ఎవరైనా ఒప్పుకుంటారు. ముఖ్యంగా కామెడీని పండించిన తీరు, తండ్రి పాత్రలో క్రూరత్వం చూపిస్తూనే క్షణాల్లో హాస్యాన్ని గుప్పించే తీరు థియేటర్లో నవ్వులు పూయిస్తోంది. ఇంపాక్ట్ బాగా ఉండాలనే ఉద్దేశంతో తెలుగు వెర్షన్ కి ఇతనే స్వయంగా 13 గంటల పాటు డబ్బింగ్ చెప్పి జాకీ అండ్ మదన్ పాత్రలను నిలబెట్టాడు. మాస్ జనాలకు ఇవి కనెక్టవుతున్నాయి. విశాల్ కంటే ఈయనే ఎక్కువగా గుర్తుంటాడని ప్రశంసలు వస్తున్నాయి.
త్వరలోనే ఎస్జె సూర్య మరో స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీలో కనిపించనున్నాడు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో మెయిన్ విలన్ ఇతనే. అయితే మార్క్ ఆంటోనీ లాగా కామెడీ చేసే స్కోప్ ఉండకపోవచ్చు కానీ రాజకీయ నాయకుడి పాత్ర కాబట్టి మంచి వేరియేషన్స్ చూసుకోవచ్చు. మూడు నాలుగేళ్ల క్రితం పాతిక లక్షలకు మించని సూర్య రెమ్యునరేషన్ ఏడాది నుంచి అయిదు కోట్లు దాటేసిందని చెన్నై టాక్. అయినా సరే ఇతనుంటేనే క్యారెక్టర్ పండుతుందని భావిస్తున్న దర్శక నిర్మాతలు పారితోషికం ఎక్కువైనా సరే సరేనని ఒప్పేసుకుంటున్నారట. టాలెంట్ టైం రెండూ కలిసి రావడమంటే ఇదే.
This post was last modified on September 16, 2023 7:07 pm
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…
అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తన అల్లరి చేష్టలతో ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…