ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత గొప్ప నటుల్లో నానా పటేకర్ ఒకరు. తెర మీద ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నానా.. బయట వ్యవహరించే, మాట్లాడే తీరు కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది. చాలా వరకు కుండబద్దలు కొట్టినట్లు ఆయన మాట్లాడేస్తుంటారు. తాజాగా ఆయన బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
గదర్-2, జవాన్ సిల్లీ సినిమాలని.. అలాంటి సినిమాలు చూసి తీరాల్సిన పరిస్థితిని ప్రేక్షకులకు కల్పిస్తున్నారని నానా వ్యాఖ్యానించడం గమనార్హం. గదర్-2 సినిమా ఇండియాలో ఏకంగా రూ.500 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా థియేటర్లో తాను ఎక్కువసేపు కూర్చోలేకపోయానని.. మధ్యలోనే వచ్చేశానని పేర్కొన్నారు.
అలాగే జవాన్ కూడా సిల్లీ సినిమా అన్నట్లు ఆయన మాట్లాడారు. ప్రేక్షకులకు మంచి సినిమాలు చూసే అవకాశం రావట్లేదని.. దీంతో ఇలాంటి సినిమాలను ఆదరించక తప్పని పరిస్థితి వస్తోందని ఆయనన్నారు. నానా పటేకర్ ప్రస్తుతం వాక్సిన్ వార్ మూవీలో నటించారు. కశ్మీర్ ఫైల్స్ తర్వాత వివేక్ రంజన్ అగ్నిహోత్రి నుంచి వస్తున్న సినిమా ఇది. ఇందులో ఒక సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నారు నానా.
ఐతే కశ్మీర్ ఫైల్స్ లాగే ఇది కూడా ప్రాపగండా మూవీ అనే చర్చ నడుస్తోంది. వివేక్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా తీస్తారనే ముద్ర ఉంది. ఇలాంటి సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన నానా.. జవాన్, గదర్-2 లాంటి సినిమాలను ఇలా తక్కువ చేసి మాట్లాడటం ఏంటనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి తలెత్తుతున్నాయి. కమర్షియల్ సినిమాలు చూసే ప్రేక్షకుల అభిరుచిని ఆయన తప్పుబడుతున్నారని విమర్శిస్తున్నారు.
This post was last modified on September 16, 2023 8:16 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…