తెలుగు బాక్సాఫీసుకి ఆక్వామెన్ టెన్షన్

పేరుకి డిసెంబర్ డ్రై మంత్ అనుకుంటాం కానీ ఆ నెల మూడో వారం నుంచే బాక్సాఫీస్ పోటీ ఓ రేంజ్ లో ఉంటుంది. సలార్ ఈ నెలలో రావాలా లేక నవంబర్ లోనే రిలీజ్ చేయాలా అనే మీమాంసలో ఉన్నది ఈ కారణంగానే. ప్రధానంగా ఒక హాలీవుడ్ మూవీని దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తోంది. డిసెంబర్ 20న ఆక్వామెన్ లాస్ట్ కింగ్ డం భారీ ఎత్తున విడుదల కానుంది. నిన్న ట్రైలర్ లో విజువల్స్ చూశాక మతి పోవడం ఒకటే తక్కువని చెప్పాలి. కథపరంగా మరీ కొత్తదనం లేకపోయినా టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ తో చేసే మేజిక్ తో ఇది బిగ్ స్క్రీన్ మీద చూడాలన్న కోరికను కలిగిస్తోంది.

సరిగ్గా అదే సమయంలో తెలుగులో నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రాడినరి మెన్ లు వస్తున్నాయి. వీటికన్నా ఎక్కువ అంచనాలతో వెంకటేష్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ సైంధవ్ ఉంటుంది. కేవలం ఒక్కొక్క రోజు వ్యవధిలో వీటి క్లాష్ పెద్ద సమస్య అనుకుంటే ఆక్వా మెన్ వల్ల ఓవర్సీస్ లో థియేటర్ల కొరత ఏర్పడుతుంది. పైగా అక్కడి డిస్ట్రిబ్యూటర్ల మొదటి ప్రాధాన్యం నీటి మనిషే అవుతాడు కాబట్టి ప్రీమియం స్క్రీన్లన్నీ దానికే వెళ్లిపోతాయి. వాళ్ళ ముందస్తు ప్లానింగ్ ఎంత ముందుచూపుతో ఉంటుందంటే ఆల్రెడీ దానికి సరిపడా థియేటర్లను ఇప్పుడే బ్లాక్ చేసి పెట్టుకునేంత.

సో సలార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోబట్టే డిసెంబర్ లో రావాలా వద్దానే మీమాంసలో పడిపోయింది. గతంలో స్పైడర్ మ్యాన్ తాకిడిని తట్టుకుని పుష్ప 1 విజయం సాధించింది. కానీ అది రిలీజయ్యే టైంలో దాని మీద మితిమీరిన హైప్ లేదు. ఏపీలో కొన్ని ఏరియాల్లో ఆశించిన లాభాలు రాలేదు. కానీ పైన చెప్పిన సినిమాల పరిస్థితి అలా లేదు. చాలా క్యాలికులేటెడ్ గా ఉండాలి. వెంకీ, నితిన్, నానిలకు పెద్దగా ఇబ్బంది అనిపించకపోవచ్చు కానీ ఆక్వామెన్ ని మాత్రం సలార్ సీరియస్ గా తీసుకోక తప్పదు. ఈ లెక్కల నేపథ్యంలోనే విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నారు.