తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఓటిటిలో వస్తోన్న తొలి భారీ చిత్రం ‘వి’కి సెప్టెంబర్ 5 విడుదల ఖాయం చేసారు. ఈ డేట్ సెలక్ట్ చేయడానికో కారణం వుంది. నాని హీరోగా నటించిన మొదటి సినిమా సెప్టెంబర్ 5నే విడుదలయింది. అష్టాచమ్మాతో హీరోగా మారిన నాని కెరియర్ మలుపు తిప్పిన ‘భలే భలే మగాడివోయ్’ సెప్టెంబర్ 4న వచ్చింది. అందుకే తన ఇరవై అయిదవ చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 5న విడుదల చేయాలని నానినే కోరాడట. అమెజాన్ ప్రైమ్ సినిమాలు మామూలుగా శుక్రవారం విడుదల చేస్తున్నారు.
అయితే గురువారం అర్థరాత్రి విడుదల చేయడం కంటే… శుక్రవారం అర్థరాత్రి విడుదల చేయడం వల్ల వ్యూస్ బాగా వస్తాయని, వీకెండ్ ఆడియన్స్ మొదటి రోజే వీక్షిస్తారని ఈ డేట్ ఖాయం చేసుకున్నారు. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ అయిదు నెలలలో విడుదలయిన అన్ని సినిమాల కంటే ‘వి’కి ఎక్కువ వ్యూయర్‍షిప్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ, హిందీ భాషల ఆడియోతో సహా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో వున్నారట. గుంజన్ సక్సేనా చిత్రాన్ని తెలుగు ఆడియోతో విడుదల చేయడం వల్ల ఇక్కడ కూడా దానికి ఆదరణ లభించింది. వి కనుక అన్ని భాషలలో అందుబాటులో వుంటే అమెజాన్ పెట్టిన ముప్పయ్ కోట్ల పెట్టుబడికి ఢోకా లేనట్టే.
This post was last modified on August 21, 2020 7:54 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…