మాములుగా ఏ భాషలో అయినా నటీనటులకు, నిర్మాతకు ఉన్న సంబంధం పారితోషికం వరకే ఉంటుంది. చెల్లింపులు పూర్తయ్యే విషయంలో ఇద్దరూ చాలా పర్టికులర్ గా ఉంటారు. అయితే సినిమా రిలీజయ్యాక కోట్ల రూపాయలు లాభాలు వచ్చినా ప్రొడ్యూసర్లు అందులో నుంచి వాటాలు తీసివ్వడం కానీ, పంచడం కానీ ఉండదు. అలాగే ఒకవేళ డిజాస్టర్ అయ్యి నష్టం వస్తే దానికి పనిచేసిన వాళ్ళు సొమ్ములు తగ్గించుకోవడమూ ఉండదు. ఇది బిజినెస్ మోడల్. ఇలాగే ఉంటుంది. కొందరు మాత్రం వీటికి మినహాయింపుగా తమకు అదనంగా వచ్చిన దాంట్లో పంచుకోవాలని చూస్తారు.
జైలర్ నిర్మాత దయానిధి మారన్ గురించి ఈ విషయంగానే సౌత్ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈయన ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ లకు కోటికి పైగా విలువ చేసే ఖరీదైన కార్లు ఇవ్వడమే కాక భారీ మొత్తంలో చెక్కులు కూడా సమర్పించారు. ఇవి రెమ్యునరేషన్లకు సంబంధం లేకుండా. జైలర్ యూనిట్ లో పని చేసిన ప్రతి ఒక్కరికి డిపార్ట్ మెంట్ కి తగ్గట్టు వాళ్ళ పనిని గుర్తించి ఒక్కొక్కరి అకౌంట్ లోకి 50 వేల నుంచి లక్ష రూపాయల దాకా నేరుగా జమచేసినట్టు చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.
ఇదంతా చెప్పకుండా ఇచ్చిన కానుకలు. గతంలో టాలీవుడ్ లోనూ ఇలాంటివి జరిగాయి. పూరి జగన్నాధ్, కొరటాల శివ, సాయి రాజేష్, మారుతీ లాంటి వాళ్లకు ఈ తరహాలో గిఫ్ట్స్ వచ్చాయి కానీ మొత్తం టీమ్ అందుకున్న దాఖలాలు మాత్రం బయట ప్రపంచానికి తెలిసినవి లేవు. దయానిధి మారన్ లాగా అందరూ ఆలోచిస్తే బాగుండునని అనుకుంటాం కానీ ఆయనంటే వేల కోట్ల వివిధ వ్యాపారాల సామ్రాజ్యానికి అధిపతి కాబట్టి ఇలా చేసే ఛాన్స్ ఉంటుంది కానీ తలను తాకట్టు పెట్టి హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేసే నిర్మాతలందరికీ ఈ అవకాశం ఉండదు. సో ఇదంతా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.
This post was last modified on September 5, 2023 2:42 pm
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…