పవన్ కళ్యాణ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్యాన్ ఇండియా మూవీగా మొదలైన హరిహర వీరమల్లు మూడేళ్లు దాటినా విడుదల ఎప్పుడు ఉంటుందనే క్లారిటీ లేకపోవడం వల్ల మెల్లగా దాని మీద బజ్ తగ్గిపోయింది. బాహుబలి రేంజ్ లో హైప్ ని ఆశించిన అభిమానులు దాన్ని మర్చిపోయి ఫోకస్ మొత్తం ఓజి మీద పెట్టేశారు. నిజానికి పవన్ తన కెరీర్ మొత్తంలో విపరీతంగా కష్టపడింది వీరమల్లుకే. కానీ నిర్మాణంలో జరిగిన ఆలస్యం, సెట్ల పరంగా వాతావరణం నుంచి తలెత్తిన ఇబ్బందులు, ప్రాక్టికల్ సమస్యలు తదితర కారణాల వల్ల ముందు భీమ్లా నాయక్, బ్రోలు పూర్తి చేసి ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ స్పీడ్ పెంచారు.
దీంతో అసలు హరిహర వీరమల్లు ఎప్పుడు రావొచ్చనే దాని గురించి స్పష్టమైన సమాధానం దొరకలేదు. ఇవాళ జరిగిన రూల్స్ రంజన్ ప్రెస్ మీట్ లో ఏఎం రత్నం మీడియా సాక్షిగా మైకు ముందుకు వచ్చారు. దీంతో సహజంగా పవన్ చిత్రం గురించి ప్రస్తావన వస్తుంది కాబట్టి దాన్నిఆయన ముందే ఊహించి సమాధానం సిద్దమయ్యి వచ్చారు. భారీ స్కేల్ తో కూడుకున్న బడ్జెట్ కాబట్టి లేట్ అయిన మాట వాస్తవమేనని, రాజకీయాల దృష్ట్యా ఇది తప్పలేదు కాబట్టి వేరే వాటికీ ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చిందే తప్ప కావాలని చేసింది కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేసి 2024 ఎన్నికలు వచ్చేలోపే రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని గుడ్ న్యూస్ చెప్పారు. వినడానికి బాగానే ఉంది నిజంగా ఇది సాధ్యమేనా అని గుచ్చి అడిగితే సరైన అన్సర్ రాకపోవచ్చు. ఎందుకంటే పవన్ ఇప్పుడు చేస్తున్న ఓజి పూర్తి చేయడానికి నవంబర్ చివరి వారం వచ్చేస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ జనవరి దాకా చిత్రీకరణ జరగొచ్చు. హరిహర వీరమల్లుకి ఎక్కువ డేట్స్ అవసరమవుతాయి కాబట్టి జనసేన కోసం ప్రచారంలో తలమునకలయ్యే పవన్ అన్ని డేట్స్ ఇస్తారా అంటే చెప్పలేం. అసలెంత భాగం పూర్తయ్యిందో రత్నం స్పష్టంగా చెప్పడం లేదు. అలాంటప్పుడు వచ్చే వేసవి అంటే గ్యారెంటీ అనలేం
Gulte Telugu Telugu Political and Movie News Updates