ఈ మధ్యే జాతీయ అవార్డుల ప్రకటన జరిగింది. అందులో టాలీవుడ్ తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు సహా మొత్తం పదకొండు అవార్డులు టాలీవుడ్ సొంతమయ్యాయి. ‘బాహుబలి’ దగ్గర్నుంచి టాలీవుడ్‌కు జాతీయ అవార్డుల్లో బాగానే గుర్తింపు లభిస్తోంది కానీ.. ఈ స్థాయిలో ఆధిపత్యం చలాయించడం ఇదే తొలిసారి. ఇది వేరే ఇండస్ట్రీల వాళ్లకు కంటగింపుగా మారి ఉంటుందనడంలో సందేహం లేదు.
ముఖ్యంగా సౌత్ ఇండియాలో చాలా ఏళ్ల పాటు అవార్డుల పరంగా ఆధిపత్యం చలాయించిన కోలీవుడ్ జనాలకు ఇది అస్సలు మింగుడు పడటం లేదు. టాలీవుడ్ బాగా రైజ్ అయిన సమయంలోనే తమిళ సినిమాల క్వాలిటీ పడిపోయింది. కలెక్షన్లు, అవార్డులు.. రెండు విధాలా కోలీవుడ్ వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలోనే జాతీయ అవార్డుల ప్రకటన సమయంలో సోషల్ మీడియాలో తమిళ నెటిజన్ల ఏడుపు మామూలుగా లేదు.
కట్ చేస్తే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో స్థిరపడ్డ తెలుగు వ్యక్తి విశాల్.. అవార్డుల గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అవార్డులను తాను నమ్మనని, పట్టించుకోనని.. ఒక సినిమాకు, ఒక నటుడికి ప్రేక్షకులు ఇచ్చే గుర్తింపే అసలైన అవార్డ్ అని విశాల్ వ్యాఖ్యానించాడు. ఒకవేళ ఒక సినిమాలో తన నటనకు గాను అవార్డు ఇచ్చినా దాన్ని చెత్త బుట్టలో పడేస్తానని విశాల్ వ్యాఖ్యానించడం గమనార్హం. అవార్డులను పట్టించుకోను అనడం కూడా ఓకే కానీ.. అవార్డు ఇస్తే చెత్త బుట్టలో పడేస్తా అనడం టూమచ్‌యే.
జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు ఆధిపత్యం చలాయించడం, తమిళ సినిమాలకు గుర్తింపు దక్కపోవడంపై అసహనం వ్యక్తమవుతున్న సమయంలోనే విశాల్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పరోక్షంగా పురస్కారాలు దక్కించుకున్న మనవాళ్లను కించపరచడమే. రెహమాన్‌కు ఆస్కార్ అవార్డులు దక్కినపుడు కోలీవుడ్ ఏ స్థాయిలో సంబరాలు చేసుకుందో తెలిసిందే. అప్పుడు విశాల్ సహా అందరూ హర్షం వ్యక్తం చేసిన వాళ్లే. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంటే అవార్డులు వేస్ట్ అన్నట్లు మాట్లాడటం కోలీవుడ్ జనాలకే చెల్లింది.
This post was last modified on September 4, 2023 8:21 am
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…