ప్రస్తుతం ఇండియాలో సెట్స్ మీద ఉన్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్నది ‘కల్కి 2898 ఏడీ’నే అనడంలో సందేహం లేదు. అసలే ప్రభాస్ సినిమా. పైగా ఇది హాలీవుడ్ స్టయిల్లో సాగే సైన్స్ ఫిక్షన్ మూవీ. అలాగే మన స్టయిలో ఫాంటసీ టచ్ కూడా ఉంది. పైగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని నెలల కిందటే వచ్చిన టీజర్ ఓ రేంజిలో ఉండటంతో హైప్ ఇంకా పెరిగింది. ఇప్పుడు ఈ సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచే అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది.
‘కల్కి’లో దర్శకు ధీరుడు రాజమౌళి ఒక క్యామియో రోల్ చేస్తున్నాడట. ఇంతకుముందు ‘మజ్ను’ సినిమాలో రాజమౌళి కొన్ని నిమిషాలు సందడి చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆయన తన నిజ జీవిత పాత్రలోనే కనిపించాడు. కానీ ‘కల్కి’లో అలా కాకుండా ఒక సైంటిస్ట్ పాత్రలో దర్శనమిస్తాడని అంటున్నారు. ‘మజ్ను’లో మాదిరి ఆయన్ని కామెడీగా వాడుకునే ఛాన్స్ లేదు. ఈ సినిమా నడత వేరు కాబట్టి చిన్నదే అయినా కథను మలుపు తిప్పే పాత్ర కావచ్చని అంటున్నారు.
రాజమౌళి ఉన్నాడంటే సినిమాకు మరింత ఆకర్షణ తోడు కావడం ఖాయం. మలయాళ టాప్ స్టార్ దుల్కర్ సల్మాన్ సైతం ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. సినిమా మీద ఆసక్తిని, అంచనాలు మరింత పెంచే అప్‌డేట్సే ఇవి. ఈ చిత్రం వచ్చే వేసవికి రిలీజ్ కావచ్చని అంటున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
This post was last modified on August 30, 2023 4:03 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…