కొన్ని నెలలుగా తన నెక్స్ట్ సినిమాపై మౌనంగా ఉంటున్న నాగార్జున తాజాగా తన తదుపరి సినిమా అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ తో గట్టిగా సందడి చేశాడు. విజయ్ బిన్నీ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగ్ చేస్తున్న ఈ సినిమాకు నా సామి రంగ అనే టైటిల్ ఫిక్స్ చేసి వచ్చే సంక్రాంతి కి రిలీజ్ అంటూ మాస్ గ్లిమ్స్ విషయం చెప్పేశారు. అయితే ఎనౌన్స్ మెంట్ కి ముందు ఈ సినిమా విషయంలో తెరవెనుక పెద్ద కథే నడిచింది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టయిన ‘పొరింజు మరియమ్ జోస్’ సినిమాకు రీమేక్.
ముందుగా ఈ కథను నాగార్జున దగ్గరికి తీసుకెళ్లింది రైటర్ ప్రసన్న. ప్రసన్న చెప్పిన కథ నచ్చడంతో నాగ్ నువ్వే డైరెక్ట్ చేయమని అడిగాడు. దీంతో ధమాకా షూటింగ్ నుండే ఈ సినిమా కథపై వర్కవుట్ చేశాడు ప్రసన్న. దాదాపు ఎనౌన్స్ మెంట్ వరకూ వెళ్ళాక కథ అడ్డం తిరిగింది. ప్రసన్న చెప్పడంతో ఆ సినిమా రీమేక్ రైట్స్ కొన్న అభిషేక్ అగర్వాల్ , వివేక్ కూచిభొట్ల ఇద్దరు అడ్డం తిరిగి ప్రసన్న కి షాక్ ఇచ్చారు. రైట్స్ తమ దగ్గర ఉన్నాయని త్వరలోనే రీమేక్ చేయనున్నట్లు అభిషేక్ అగర్వాల్ ఆఫీషియల్ గా ప్రకటించే సరికి ఈ రీమేక్ చిక్కుల్లో పడింది. అక్కడి నుండి ప్రసన్న ఈ రీమేక్ రైట్స్ విషయంలో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.
నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఎట్టకేలకు వారితో సెటిల్ చేయించుకొని ప్రసన్న రెమ్యూనరేషన్ కి గండి కొట్టాడట. ఇక అంతా ఒకే అనుకునే లోపు నాగార్జున కి రైటర్ ప్రసన్న ఈ రీమేక్ విషయంలో ఏదో చెడింది. ఈ రీమేక్ విషయంలో ఇంత కాంప్లికేట్ చేసి నిర్మాతను ఇబ్బంది పెట్టిన ప్రసన్న వైఖరి నాగ్ కి నచ్చకపోవడంతో అతని ప్లేస్ లో డాన్స్ మాస్టర్ విజయ్ కి అవకాశం ఇచ్చాడు కింగ్. ఇక ప్రసన్న రాసిన కథను కొన్ని మార్పులతో ఇప్పుడు విజయ్ బిన్నీ డైరెక్ట్ చేయబోతున్నాడు.
మేజర్ గా ప్రసన్న వర్షన్ తీసుకున్నారు కాబట్టి రైటర్ గా పేరు వేశారు. అలా దర్శకుడిగా పోస్టర్ మీద పడాల్సిన ప్రసన్న పేరు విజయ్ బిన్నీ పేరు కింద రైటర్ గా పడింది. ‘నా సామి రంగ’ వెనుక ఇంత జరిగింది. ఈ సినిమాకు నాగ్ పెట్టుకున్న నమ్మకం సక్సెస్ తో నిరూపించుకోవాల్సిన భాద్యత విజయ్ మీద ఉంది మరి.