ఎన్నో బ్రేకులు, అవాంతరాలు, మార్పులు చేర్పుల మధ్య ఎట్టకేలకు సరైన పట్టాలెక్కిన గుంటూరు కారం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. హైదరాబాద్ లోనే కీలక షెడ్యూల్స్ ని ప్లాన్ చేయడంతో మహేష్ బాబుతో సహా క్యాస్టింగ్ మొత్తం ఇందులో పాల్గొంటోంది. తాజాగా శ్రీలీల కిడ్నాప్ అయ్యే ఎపిసోడ్ ని షూట్ చేశారని సమాచారం. విలన్లు తీసుకెళ్లిపోయాక హీరో వచ్చి ఆమెను కాపాడే ట్రాక్ ఓ రేంజ్ లో వచ్చిందని ఇన్ సైడ్ టాక్. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎప్పుడో వచ్చిన అతడు, జులాయి తర్వాత ఆ స్థాయి అనిపించే యాక్షన్ మాస్ ని ఇందులో చూపిస్తున్నారని వినికిడి.
ఈ కాపాడే క్రమాన్ని కూడా ఊర మాస్ గా తీశారని అంటున్నారు. అభిమానులు గుంటూరు కారం మీద ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారో త్రివిక్రమ్ కు తెలుసు. అందులోనూ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన ఒత్తిడి తన మీద ఉంది. అల వైకుంఠపురములో తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ ని ఈ ప్రాజెక్టుతో పాటు పవన్ కళ్యాణ్ సినిమాలకు రచన చేసేందుకు వాడుకున్న గురూజీ ఎలాంటి పొరపాటుకి ఛాన్స్ ఇవ్వకుండా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. తమన్ ఇచ్చిన పాటల్లో ఆల్రెడీ రెండు ఓకే కాగా త్వరలోనే లిరికల్ వీడియో వదలబోతున్నారు.
జనవరి 12 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఖచ్చితంగా ఆ డెడ్ లైన్ మీట్ అవ్వాల్సిందేనని బలంగా ఫిక్స్ కావడంతో దానికి అనుగుణంగానే షూట్ జరుగుతోంది. గుంటూరు కారం ప్యాన్ ఇండియా మూవీ కాదు కాబట్టి ప్రమోషన్, డబ్బింగ్ పరంగా అదనపు బరువులు, బాధ్యతలు లేవు. చక్కగా డిసెంబర్ రెండో వారంలోపు గుమ్మడికాయ కొట్టేసుకుంటే ఓ రెండు వారాలు పబ్లిసిటీకి సరిపోతాయి. పోటీ ఎంత ఉన్నా ఎవరు ఉన్నా మహేష్ మాత్రం పండక్కు తగ్గేదేలే అంటున్నాడట. సో అభిమానులు బాబు మాస్ కోసం కౌంట్ డౌన్ మొదలుపెట్టేసుకోవచ్చు.
This post was last modified on August 25, 2023 12:18 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…