స్టేజ్‌ల మీద ఎగ్జైట్మెంట్‌తో మాట్లాడే క్రమంలో కొన్నిసార్లు మాటలు తడబడుతుంటాయి. ఒకరికి ఎలివేషన్ ఇవ్వబోయి ఇంకొకరిని టార్గెట్ చేసి ఇబ్బంది పడుతుంటారు వక్తలు. టాలీవుడ్ యువ నటుడు రానా దగ్గుబాటి వేదికల మీద చాలా వరకు హుందాగానే మాట్లాడుతుంటాడు. జోకులు పేల్చినా హద్దులు దాటకుండా చూసుకుంటాడు. కానీ మొన్న దుల్కర్ సల్మాన్ సినిమా ‘కింగ్ ఆఫ్ కొత్త’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అతను ఒక బాలీవుడ్ కథానాయికను టార్గెట్ చేసిన తీరు చర్చనీయాంశం అయింది. దుల్కర్ ఎంత వినమ్రంగా ఉంటాడో చెబుతూ.. తాను చూసిన అతడి షూటింగ్ విశేషాలను అతను పంచుకున్నాడు.
దుల్కర్ నటించిన ఒక హిందీ సినిమా షూటింగ్ తమ ఇంటికి దగ్గర్లో జరుగుతుంటే చూడ్డానికి వెళ్లానని.. ఓవైపు దుల్కర్ చాలా సింపుల్‌గా ఉంటే, అందులో నటించిన ఒక హిందీ స్టార్ హీరోయిన్ మాత్రం అతి చేసిందని.. అతను ఎండలో ఉండి షాట్ కోసం ఎదురు చూస్తుంటే ఫోన్లు మాట్లాడుకుంటూ, ఇంకేదో చేస్తూ టైం వేస్ట్ చేసిందని.. ఆమె తీరు నచ్చక చేతిలో ఉన్న బాటిల్‌ను తాను పగలగొట్టడమే కాక.. షూట్ అయ్యాక తన మిత్రులైన ఆ సినిమా నిర్మాతలను తిట్టిపోశానని రానా వెల్లడించాడు.
ఐతే ఆ వేడుకలో సినిమా పేరు.. ఆ హీరోయిన్ ఎవరన్నది వెల్లడించకపోయినా.. ఈ సినిమా ‘ది జోయా ఫ్యాక్టర్’ అని, రానా మాట్లాడింది సోనమ్ కపూర్ గురించి అని నెటిజన్లు అర్థం చేసుకున్నారు. సోనమ్‌కు ఇంత పొగరా అంటూ చాలామంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. దుల్కర్ ముందు నువ్వెంత అంటూ ఆమె మీద పోస్టులు పెట్టారు. ఈ ట్రోలింగ్ కొంచెం హద్దులు దాటడంతో రానా స్పందించాడు. తాను సరదాగానే ఆ విషయం చెప్పానని.. దుల్కర్‌తో పాటు సోనమ్ కూడా తన ఫ్రెండే అని.. ఇలా ఆమెను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అన్నాడు. తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని.. సోనమ్‌తో పాటు దుల్కర్‌కు కూడా తాను సారీ చెబుతున్నానని కూడా రానా అన్నాడు.
This post was last modified on August 15, 2023 4:02 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…