మన ఆడియన్స్ కి అంతగా పరిచయం లేదు కాబట్టి సిద్దార్థ్ మల్హోత్రాని హీరోయిన్ కియారా అద్వానీ భర్తగా చెప్పాల్సి ఉంటుంది. పెద్ద స్టార్ కాకపోయినా చెప్పుకోదగ్గ సినిమాలతో మంచి మార్కెట్ సంపాదించుకుని టాప్ లీగ్ ని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఈ ఏడాది ఇతని సినిమా మిషన్ మజ్ను ఒకటే వచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్. అది కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకుంది. కానీ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోలేదు. అంతకు ముందు థాంక్ గాడ్ డిజాస్టర్ కొట్టింది. అయితే తనతో దిల్ రాజు ఓ భారీ బాలీవుడ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టుగా వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది.
హిందీలో పాగా వేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. రాజ్ కుమార్ రావుని పెట్టి విశ్వక్ సేన్ హిట్ ని రీమేక్ చేస్తే దారుణంగా పోయింది. భాగస్వామ్యం తీసుకున్న షాహిద్ కపూర్ జెర్సీ గట్టి దెబ్బేసింది. అందుకే ఎఫ్2 రీమేక్ ని బోనీ కపూర్ తో తీయాలనే ప్రతిపాదనని పెండింగ్ లో ఉంచారు. పడ్డ చోటే గెలవాలని ఇప్పుడు సిద్దార్థ్ మల్హోత్రాతో మంచి బడ్జెట్ తో సినిమాని సెట్ చేస్తున్నారట. దీనికి దర్శకుడిగా శైలేష్ కొలనునే వ్యవహరించబోతున్నట్టు తెలిసింది. తనకు కూడా హిందీ హిట్ షాక్ ఇచ్చింది. అందుకే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలుగులో యాభై సినిమాలు పూర్తి చేసి తమిళంలో వారసుడుతో ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ కొట్టిన దిల్ రాజు ఎట్టి పరిస్థితుల్లో హిందీ మార్కెట్ ని పట్టాలనే లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ అంతటి వాడే పిలిచి మరీ సౌత్ దర్శకుడు ఆట్లీతో జవాన్ చేయగా లేనిది సరైన కథలు కాంబినేషన్లతో వెళ్తే కనక తెలుగు ప్రొడ్యూసర్లకు రెడ్ కార్పెట్ దక్కే మాట వాస్తవమే. పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటివి ఈ పోకడకి పునాది వేశాయి. మరి రామానాయుడుగారిలా మల్టీ లాంగ్వేజ్ ప్రొడ్యూసర్ గా ఎదగాలనుకుంటున్న దిల్ రాజు అన్నంత పని చేసేలానే ఉన్నారు.
This post was last modified on August 14, 2023 12:08 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…