Movie News

పంచెకట్టు పూనకాలతో మహేష్ మాస్

ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ ఏదైనా పాట వస్తుందేమోనని ఆశించిన అభిమానులకు నిరాశ కలిగించినా గుంటూరు కారం టీమ్ ఒక ఊర మాస్ పోస్టర్ తో వాళ్ళను సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది. పంచెకట్టుతో కూర్చుని, గాగుల్స్ పెట్టుకుని, స్టైలిష్ గా బీడీ వెలిగించుకునే స్టిల్ మాములు కిరాక్ గా లేదు. అయితే షూటింగ్ జరిగిందే కొంత భాగం కాబట్టి అందులో నుంచే బెస్ట్ అనిపించే లుక్స్ తీసుకుని టీజర్ తర్వాత ఇప్పుడీ గిఫ్ట్ ని అందజేశారు. ఈ కాంబో గత చిత్రాలు అతడు, ఖలేజాలకు పూర్తి భిన్నంగా ఊర మాస్ కంటెంటనే హామీ అయితే ఇచ్చాడు.

పనిలో పనిగా కొన్ని డౌట్స్ కి క్లారిటీ కూడా ఇచ్చేశారు. సంగీత దర్శకుడు తమనే ఉంటాడని నొక్కి చెప్పారు. కేవలం నాలుగున్నర నెలలే టైం ఉంది కాబట్టి షూటింగ్ అయిపోతుందా లేదానే అనుమానాలకు చెక్ పెడుతూ 2024 జనవరి 12 విడుదల తేదీని మరోసారి హైలైట్ చేశారు. కెమరామెన్ గా పిఎస్ వినోద్ కొనసాగుతున్నారు. రవి కె చంద్రన్ వచ్చారన్న వార్త నిజం కాదనే క్లారిటీ వచ్చేసింది. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఉంటారనే విషయం అఫీషియల్ గా చెప్పినట్టు అయ్యింది. సో పలు రకాల అంశాల మీద ఉన్న అయోమయం ఒకరకంగా తొలగిపోయినట్టే.

కేవలం మహేష్ కి మాత్రమే పరిమితం చేయడంతో పోస్టర్ లో ఇంకెవరూ లేరు. బిజినెస్ మెన్ రీ రిలీజ్ ని ఎంజాయ్ చేస్తున్న అభిమానులు గుంటూరు కారం ఇచ్చింది చిన్న కానుకే అయినా సర్దుకుని అందులో ఉన్న మాస్ ర్యాంపేజ్ కి కృతజ్ఞతలు చెప్పేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ అసలైన కౌంట్ డౌన్ ఇకపై ఉంటుంది. ఇంకా పాటలు ఫైనల్ చేయడం, వాటి చిత్రీకరణతో పాటు టాకీ పార్ట్ చాలా బాలన్స్ ఉంది. మహేష్ వచ్చే వారం విదేశాల నుంచి తిరిగి వచ్చాక నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేయబోతున్నారు. డిసెంబర్ చివరి వారంలోపే ఫస్ట్ కాపీ సిద్ధం చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. 

This post was last modified on August 9, 2023 10:36 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

2 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

4 hours ago