పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఇప్పటిదాకా సినిమాలతో తనకేమీ టచ్ లేదన్నట్లే ఉంటున్నాడు. అసలతను చాలా ఏళ్ల నుంచి తల్లితో కలిసి పుణెలోనే ఉంటూ అక్కడే చదువుకుంటున్నాడు. ఎప్పుడో ఒకసారి ఎయిర్‌పోర్ట్‌ల్లో మీడియా కళ్లలో పడటమే తప్ప అతను ఏమాత్రం లైమ్ లైట్‌కు దగ్గర్లో లేడు. కానీ పవన్ తనయుడిని హీరోగా చూడాలన్నది అభిమానుల ఆకాంక్ష. అకీరా పేరు ఎత్తితే చాలు పవన్ అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది.
తన ఫొటోలు ఏవైనా బయటికి వస్తే చాలు.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. తనకు హీరో ఎలివేషన్లు ఇచ్చేస్తుంటారు ఫ్యాన్స్. అలాంటిది పవన్ సినిమా విడుదల సందర్భంగా అకీరా థియేటర్లలో కనిపిస్తే ఇంకేమైనా ఉందా? శుక్రవారం అదే జరిగింది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో అకీరా ‘బ్రో’ సినిమా చూశాడు.
అకీరా వచ్చాడని తెలియగానే థియేటర్ దగ్గర మామూలు హడావుడి లేదు. ఒక స్టార్ హీరో వచ్చినంత హంగామా చేశారు అభిమానులు. పవన్, అకీరాల పేర్లతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. ఫ్యూచర్ పవర్ స్టార్ అంటూ అకీరా గురించి నినాదాలు చేశారు ఫ్యాన్స్. అభిమానులను దాటుకుని థియేటర్లోకి వెళ్లడానికి అకీరా చాలానే కష్టపడాల్సి వచ్చింది.
సినిమా నడుస్తున్నంతసేపూ అందరి చూపూ అకీరా మీదే ఉంది. తండ్రిని మించి పొడవుగా ఎదిగిపోయిన అకీరా.. హీరోగా బాగా క్లిక్ అవుతాడనే అందరూ అంచనా వేస్తున్నారు. అతను కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడనే అంచనాతోనే ఉన్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చదువుకుంటూనే నటనలో అకీరా శిక్షణ తీసుకుంటూ ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక మూణ్నాలుగేళ్లలో అకీరా తెరంగేట్రం గురించి వార్త బయటికి వస్తుందనే అంచనాతో ఉన్నారు.
This post was last modified on July 28, 2023 5:34 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…