మాములుగా చిరంజీవి సినిమాల్లో ఆయన కుటుంబ హీరోల రెఫరెన్సులు ఉండవు. మెగాస్టార్ బ్రాండ్ నే మిగిలినవాళ్లు వాడుకోవడం చూశాం కానీ భోళా శంకర్ విషయంలో మాత్రం దానికి మినహాయింపు ఇచ్చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లను స్వేచ్ఛగా వాడేసుకున్నారు. శ్రీముఖితో సరదాగా జరిగే లవ్ ఎపిసోడ్ ని ఖుషి తరహాలో డిజైన్ చేశారన్న లీక్ ఎప్పుడో వచ్చింది. దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నట్టుగా ట్రైలర్ లో ఒక షాట్ తో దాన్ని రివీల్ చేశారు. అఆ అంటూ అచ్చం తమ్ముడి కాలర్ మ్యానరిజంని దించేశారు. ఏ మేరా జహా పాటని యుజ్ చేయడం ఆల్రెడీ టీజర్ లో చూసేశాం.
ఇక తమన్నాతో రంగస్థలం బాబు అనిపించడం కూడా ఈ స్ట్రాటజీలో భాగమే. అయితే ఈ వాడకం ఏ మేరకు పేలిందనేది థియేటర్లో చూస్తే కానీ అర్థం కాదు. ఎందుకంటే చిరు సీనియర్ ఫ్యాన్స్ కి ఇలా చేయడం ఇష్టం లేదు. ఏ మాత్రం తేడా వచ్చినా ఆడియన్స్ ని వీటిని స్పూఫ్ గా చూస్తారని, అదే జరిగితే కథలో సీరియస్ నెస్ డైవర్ట్ అవ్వొచ్చని వాళ్ళ ఫీలింగ్. అందులో పాయింట్ లేకపోలేదు. ఎందుకంటే నలభై ఏళ్ళ కెరీర్లో ఎప్పుడూ ఇలా చేయని చిరు హఠాత్తుగా కొత్త టర్న్ తీసుకోవడం ఆశ్చర్యమే. ఆయన నిర్ణయం రైటా రాంగా అనేది స్క్రీన్ మీద చూశాకే తెలుస్తుంది.
ట్రైలర్ పట్ల ఫ్యాన్స్ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుండగా మూవీ లవర్స్ మాత్రం ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య టెంప్లేట్ లో యాక్షన్ సీక్వెన్స్ ని పెట్టేసి సేఫ్ గేమ్ ఆడారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరు కామెడీ టైమింగ్ ని మాత్రం దర్శకుడు మెహర్ రమేష్ గట్టిగానే వాడినట్టు కన్ఫర్మ్ అయ్యింది. క్యాస్టింగ్ గట్రా రొటీన్ వ్యవహారాలే కానీ తమన్నా గ్లామర్, కీర్తి సురేష్-సుశాంత్ జోడి, మహతి స్వరసాగర్ సంగీతం ఎంతమేరకు భోళా శంకర్ కు ప్లస్ అయ్యాయో ఫలితాన్ని బట్టి చెప్పొచ్చు. ఆగస్ట్ 11 విడుదల కాబోతున్న భోళా శంకర్ కు రజనీకాంత్ జైలర్ రూపంలో పెద్ద పోటీనే ఉంది.