పాపం ఫోటో స్టూడియో…ఇలా అయ్యిందేంటి 

చిన్న సినిమాలను విడుదల చేయడం కన్నా వాటిని పబ్లిక్ లోకి తీసుకెళ్లి థియేటర్ కు వచ్చేలా ఆసక్తి రేపడం చాలా కీలకం. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే ఎంత పెద్ద బ్యానర్ల అండ ఉన్నా జనానికి చేరదు. నిన్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో రిలీజయ్యింది. పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని ప్రొడ్యూసర్. సోషల్ మీడియాలో బాగా పేరున్న చైతన్య రావు హీరోగా గతంలో ఓ పిట్ట కథ తీసిన చందు ముద్దు దర్శకత్వంలో తీశారు. యూనిట్ చాలా కష్టపడి ఊరురూ తిరుగుతూ పబ్లిసిటీ చేసుకుని ఎట్టకేలకు థియేటర్లలో బొమ్మ పడేలా చేసుకున్నారు. కానీ జరిగిందేమిటి.

ఆడియన్స్ ఈ ఫోటో స్టూడియో పట్ల ఇంట్రెస్ట్  చూపించలేదు. చాలా చోట్ల మధ్యాన్నం ఆటలకే కనీసం డబుల్ డిజిట్ జనాలు లేక షోలు వేయలేని పరిస్థితి. ఇవాళ వీకెండ్ అయినా సరే చాలా మల్టీప్లెక్సుల్లో క్యాన్సిల్ చేశారని సమాచారం. నలభై ఏళ్ళ క్రితం జరిగిన రెట్రో కామెడీ కం క్రైమ్ డ్రామాగా చందు తీసిన విధానం హాఫ్ బాయిల్డ్ గా ఉండటం, అదే టాక్ రూపంలో బయటికి రావడం కొంత ప్రభావాన్ని చూపించింది. అయినా సరే ఓ మోస్తరుగా ఉన్నా చాలు చూసే ప్రేక్షకులు ప్రత్యేకంగా కొందరైనా ఉంటారు. కానీ కనీసం వాళ్ళు కూడా రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇదే కాదు నిన్న రిలీజైన దాదాపు అన్నింటిది ఇదే సీన్. తిరిగి బేబీనే ఊపందుకుంది. మెయిన్ సెంటర్స్ లో సోల్డ్ అవుట్ బోర్డులు పెడుతున్నారు. ఓపెన్ హెయిమర్, బార్బీలకు స్పందన బాగుంది. విజయ్ ఆంటోనీ హత్య సైతం మినిమమ్ ఆక్యుపెన్సీని ఆకట్టుకోలేక చతికిలబడింది. నెగటివ్ రివ్యూలు రావడం మరో దెబ్బ. అయినా ఓటిటికి ఫిట్ అయ్యే కంటెంట్ ని ఆ కంపెనీలు పెడుతున్న కండీషన్ల వల్ల థియేట్రికల్ రిలీజులు చేస్తున్న నిర్మాతలకు రెండు వైపులా బాదుడు తప్పడం లేదు. పెద్దగా పోటీ లేని సోలో సీజన్ లో వచ్చి ఉంటే అన్నపూర్ణ ఫోటో స్టూడియో కొంతైనా గట్టెక్కేదేమో.