ఎండాకాలంలో వరదలు వచ్చినట్టు వేసవి సెలవులు అయిపోయి స్కూళ్ళు, కాలేజీలు శుభ్రంగా నడుస్తున్న టైంలో ఒక కొత్త సినిమా సోమవారం హౌస్ ఫుల్స్ పడటం చిన్న విషయం కాదు. అది కూడా కనీస ఇమేజ్ లేని క్యాస్టింగ్ నటించిన మూవీ కావడం అసలు విచిత్రం. బేబీ అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపిస్తోంది. క్లాసు మాస్ తేడా లేకుండా నిన్న దాదాపు అని సెంటర్లలో సోల్డ్ అవుట్ బోర్డుతో వసూళ్లు హోరెత్తిపోయాయి. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనిది వీక్ డేస్ లో స్క్రీన్లు పెంచడం అన్నది ఒక్క బేబీ విషయంలోనే జరిగిందనేది కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం.
ఇలా జరగడానికి కారణం యువత. నిన్న చాలా చోట్ల ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో అటెండెన్స్ శాతం చాలా తక్కువ ఉందట. ఎందుకయ్యా అంటే అందరూ పొలోమని బేబీ థియేటర్లకు వెళ్లిపోయారు. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. తెలంగాణలో బోనాలు సెలవు కాబట్టి ఏదోలే అనుకోవచ్చు కానీ అసలు హాలిడేనే లేని ఆంధ్రప్రదేశ్ లో సైతం అదే సీన్ కనిపించింది. స్నేహితులు, ప్రేమికులు గుంపులుగా టికెట్ కౌంటర్లకు క్యూ కట్టేస్తున్నారు. ప్రేమలో ఉన్నోళ్లు, బ్రేకప్ లవర్స్, ఫ్రెష్ గా లవ్ లో పడ్డోళ్లు ఇలా ఎవరికి వారు రీజన్స్ పెట్టుకుని బేబీ చూస్తున్నారు.
కంటెంట్ పరంగా కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటి కీ విజయ్ బుల్గానిన్ సంగీతం, వైష్ణవి నటన, ఆనంద్ పాత్ర, ఇంటర్వెల్ బ్లాక్, రాత్రి వేళ బిల్డింగ్ పైన హీరో హీరోయిన్ తిట్టుకునే సన్నివేశం, ప్రేమిస్తున్నా పాట వాళ్ళ టికెట్ డబ్బులకు డబుల్ రిటర్న్ వచ్చేసిందని వాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తమ నిజ జీవితానికి దగ్గరగా ఉన్న విషయాలను అంత లోతుగా చూపించడంతో ముఖ్యంగా కుర్రాళ్ళు బేబీని రిపీట్స్ వేస్తున్నారు. ఈ దూకుడు కనీసం ఇంకో వారం పైనే ఉంటుందని బయ్యర్ల అంచనా. అదే జరిగితే ఫైనల్ గా తేలే లాభాలు దీన్ని డౌట్ పడి కొనకుండా వదిలేసిన డిస్ట్రిబ్యూటర్లకు నిద్రను దూరం చేయడం ఖాయం.
This post was last modified on July 18, 2023 1:13 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…