Movie News

ఖుషి కథకి స్ఫూర్తి మణిరత్నమా

విజయ్ దేవరకొండ-సమంతా మొదటి కలయికలో రూపొందుతున్న ఖుషి సెప్టెంబర్ 1 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. లైగర్ డిజాస్టర్ తర్వాత ఓవర్ అగ్రెసివ్ హీరోయిజంకి సెలవు చెప్పేసి విభిన్న కథలను ఎంచుకునే ప్రయత్నంలో రౌడీ హీరోకి మరోసారి ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ ని దగ్గర చేసే ఛాన్స్ ఖుషి ఇచ్చేలా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ మీద దర్శకుడు శివ నిర్వాణ చాలా కష్టపడుతున్నాడు. టక్ జగదీష్ ఫలితం గురించి వచ్చిన నెగటివ్ కామెంట్స్ కి దీంతోనే సమాధానం చెప్పాలి.

ఇక ఖుషి కథకు సంబంధించిన కొన్ని లీకులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇదో హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ప్రేమ కథఏ హింట్ ఫస్ట్ లిరికల్ వీడియోలో ఇంతకు ముందే ఇచ్చారు. నిన్న వదిలిన ఆరాధ్య సాంగ్ లో ఇద్దరూ కలిసి ఒకే ఆఫీస్ లో పని చేసినట్టు చూపించారు. అంటే మణిరత్నం దిల్ సేలో మనిషా కొయిరాలా పాత్ర ఛాయల్లో సమంతా పాత్రని డిజైన్ చేసి ఉండొచ్చనే మాటని పూర్తిగా కొట్టి పారేయలేం. మరో ట్విస్టు కూడా చెబుతున్నారు. ఒక సామ్ దూరమయ్యాక అదే పోలికలతో ఉన్న మరో సామ్ ని కాశ్మీర్ లో చూసిన హీరో మళ్ళీ ప్రేమలో పడటమనే పాయింట్ కూడా ఉండొచ్చట.

రెండూ నిజమో కాదో చెప్పలేం కానీ అభిమానుల మధ్య మాత్రం ఆసక్తికరమైన చర్చకు దారి తీసేలా ఉంది. శివ నిర్వాణ మీద నిజంగానే మణిరత్నం ప్రభావం ఉంటుంది. మజిలీని మౌన రాగం నుంచే స్ఫూర్తి చెంది రాసుకోవడం అబద్దం కాదు. కాకపోతే అందులో మోహన్, కార్తీక్ లను కలిపి నాగచైతన్య పాత్రగా మార్చాడు. నిన్ను కోరిలో సైతం అలాంటి పొయెటిక్ టచ్ ఉంటుంది. సో ఖుషిలోనూ ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. నా రోజా నువ్వే నా అంజలి నువ్వేలో మణిరత్నం టైటిల్స్ అన్నీ వాడేశాడు. కాబట్టి పైన క్లూస్ ని అంత తేలిగ్గా తీసుకోవడానికి మాత్రం లేదు. 

This post was last modified on July 13, 2023 12:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

28 minutes ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

1 hour ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

1 hour ago

జగన్ మారిపోయినట్టేనా

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు.…

4 hours ago

ఆ మలయాళ హిట్.. మొత్తం హైదరాబాద్‌లో

కొవిడ్ వల్ల సినీ పరిశ్రమలు ఎలా కుదేలయ్యాయో తెలిసిందే. కానీ ఆ టైంలో మలయాళ ఇండస్ట్రీ సైతం ఇబ్బంది పడింది…

12 hours ago

జనవరిలో మాట.. మార్చిలో అచరణ

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల మద్య స్నేహబంధం ఇప్పటిది కాదు. ఎప్పుడో చంద్రబాబు…

13 hours ago