యాంటీ ఫాన్స్ దాడితో ఆమె ఆదాయం పెరిగింది!

ఆలియా భట్‍పై పగ పెంచుకున్న సుషాంత్‍ సింగ్‍ రాజ్‍పుట్‍ అభిమానులు ఆమె సినిమా సడక్‍ 2 ట్రెయిలర్‍పై ఆ కసి అంతా చూపిస్తున్నారు. తొంభై మూడు లక్షలకు పైగా డిస్‍ లైక్స్తో ఈ ట్రెయిలర్‍ ప్రపంచ రికార్డు ఏదో సాధించిందట. ఆలియా భట్‍కి తమ సత్తా ఏంటో తెలిసిందని ఆమె యాంటీ ఫాన్స్ ఆనంద పడుతున్నారు కానీ ఇందులో వారికి తెలియకుండానే చాలా లాభం జరిగింది.

మామూలుగా ఈ సినిమా ట్రెయిలర్‍ వస్తే ఆలియా, సంజయ్ దత్‍ అభిమానులు మినహా ఎక్కువ మంది పట్టించుకునే వారు కాదేమో. కానీ ఈ డిస్‍ లైక్స్ వల్ల ఈ ట్రెయిలర్‍కి విపరీతమైన ప్రచారం లభించి, అంతా ఒక లుక్‍ వేస్తున్నారు. దాంతో ట్రెయిలర్‍కు బ్రహ్మాండమయిన వ్యూస్‍ వచ్చేసాయి. దాదాపు నాలుగు కోట్ల వ్యూస్‍ ఈ ట్రెయిలర్‍ ఇప్పటివరకు సాధించింది. ఇంకా యూట్యూబ్‍లో సెకండ్‍ ప్లేస్‍లో ట్రెండ్‍ అవుతోంది. యూట్యూబ్‍లో వ్యూస్‍కి రెవెన్యూ వస్తుంది కానీ డిస్‍ లైక్స్ వల్ల ఎలాంటి డిడక్షన్‍ వుండదు.

కాబట్టి ఈ డిస్‍ లైక్స్ కొట్టే పేరుతో ఈ చిత్రానికి అదనపు ఆదాయాన్ని యాంటీ ఫాన్సే అందిస్తున్నారు. సింపుల్‍గా ఒక ఉదాహరణ చెప్పాలంటే… ఆలియా భట్‍ హిట్‍ సినిమా రాజీ ట్రెయిలర్‍కి రెండేళ్లలో 28 మిలియన్ల వ్యూస్‍ వస్తే, సడక్‍ 2 ట్రెయిలర్‍కి రెండు రోజుల్లో 39 మిలియన్‍ వ్యూస్‍ వచ్చాయి.