తెలుగు సినిమా చరిత్రలోనే ఉత్తమ ప్రేమకథా చిత్రాల జాబితా తీస్తే అందులో టాప్-10లో నిలవగల చిత్రం ‘తొలి ప్రేమ’. పవన్ కళ్యాణ్ కెరీర్ ఆరంభ రోజుల్లో కొత్త దర్శకుడు కరుణాకరన్‌తో చేసిన ఈ చిత్రం యువ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కెరీర్లో తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాతికేళ్ల తర్వాత చూసినా కూడా ఫ్రెష్‌గా, ఎంగేజింగ్‌గా అనిపించే ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ఇది.
ఈ చిత్రాన్ని ఈ రోజు రీ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు కరుణాకరన్ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. తన జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా గురించి అతను మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. అందులో భాగంగా ‘తొలి ప్రేమ’ సినిమా అసలు ఎలా పట్టాలెక్కిందనే ఆసక్తికర కథను అతను పంచుకున్నాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..
‘‘నేను ప్రేమదేశం సినిమా టైంలో ఖదీర్ గారి దగ్గర క్లాప్ అసిస్టెంట్‌గా చేరాను. తర్వాత కో డైరెక్టర్ అయ్యాను. తర్వాత ఓ కథ రెడీ చేసుకుని ఎవరికి చెప్పాలా అనుకుంటున్నపుడు ఒక మ్యాగజైన్‌లో కళ్యాణ్ గారి ఫొటో కనిపించింది. ఇతనే నా హీరో అనుకున్నా. అప్పటికి ఆయన చిరంజీవి గారి తమ్ముడని కూడా తెలియదు. కానీ ఆయన్ని ఎలా కలవాలో తెలియదు.
ఒక తెలుగు సినిమా చర్చల్లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చినపుడు నా ఫ్రెండు ద్వారా పరిచయం అయిన గిరి అనే వ్యక్తి కళ్యాణ్ గారి బాబాయి సూర్యంను కలిపించారు. ఆయన కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఇచ్చారు. మా కారు పంచర్ అయి రాత్రి 7 గంటలకు వెళ్లాల్సిన వాళ్లం 8.30కి వెళ్లాం. ఆయన కోపంగా ఉన్నారు. చేతిలో గన్ కూడా ఉంది. దాన్ని టేబుల్ మీద పెట్టారు. అన్నయ్యా, మీకు కథ నచ్చకపోతే కాల్చేయరు కదా అన్నాను. ఆయన నవ్వేశారు.
కోపం అంతా పోయింది. తమిళంలో ఆయనకు కథ చెప్పాను. నేను వేసుకున్న స్టోరీ బోర్డ్ చూపిస్తూ కథ చెబితే.. ‘ఇంతకాలం ఎక్కడున్నావ్ , కథ నచ్చింది, సినిమా చేస్తున్నాం’ అన్నారు. తర్వాత నిర్మాత జీవీజీ రాజును పరిచయం చేసి సినిమాను పట్టాలెక్కించారు. సినిమా రిలీజైనపుడు నేను చెన్నైలో ఉంటే కళ్యాణ్ అన్నయ్యే ఫోన్ చేసి ‘సూపర్ హిట్ టాక్ వచ్చింది’ అన్నారు. నాకు కన్నీళ్లు ఆగలేదు’’ అని కరుణాకరన్ నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on June 30, 2023 6:18 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…