హిట్ ఇచ్చిన దర్శకుల వెంట టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు పడుతుంటారని అంటారు. కానీ ఈ దర్శకులను చూస్తే అది నిజం కాదనిపిస్తుంది. అర్జున్‍రెడ్డి లాంటి సంచలన సినిమా తీసి, తర్వాత అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి అంతకంటే పెద్ద హిట్టిచ్చిన సందీప్ రెడ్డి వంగా తదుపరి చిత్రం ఇంతవరకు ఖరారు కాలేదు.
ఎంతమంది హీరోల చుట్టూ తిరిగినా కానీ ఇప్పటికి ఎవరూ అతడితో సినిమా చేస్తామని ఖచ్చితంగా చెప్పలేదు. ఆర్‍ఎక్స్100 తీసిన అజయ్ భూపతి కథ తెలిసిందే. ఎన్నిసార్లు ప్రాజెక్ట్ ఓకే అయిపోయిందని అనుకున్నా కానీ ‘మహాసముద్రం’ అలలు అసలు పైకి లేవనే లేవడం లేదు. ఈ యువ దర్శకుల కథ ఇలాగుంటే… సీనియర్లు, అద్భుతమైన సినిమాలు తీసిన సుకుమార్, కొరటాల శివది మరో వ్యధ.
రెండున్నర సంవత్సరాలుగా ఈ ఇద్దరూ ఒకే సినిమాతో స్టక్ అయిపోయి వున్నారు. ప్రస్తుత పరిస్థితులలో మరో ఏడాదికి పైగా నిరీక్షణ తప్పదు. కొరటాల శివ ఈసారి జాగ్రత్త పడి ముందే తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్‍తో ఓకే చేసేసుకున్నాడు. సుకుమార్ కూడా పుష్ప ఆలస్యమవుతోంది కనుక ఈలోగా తదుపరి చిత్రం కోసం కథ రెడీ చేసుకుని హీరోని ఫిక్స్ చేసేసుకుంటే బెటరు.
This post was last modified on August 12, 2020 12:17 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…