భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న దక్షిణాది నటుల్లో ధనుష్ ఒకడు. యావరేజ్ లుక్స్‌తో కనిపించినా.. కేవలం తన యాక్టింగ్ టాలెంట్‌తో తమిళులనే కాక తెలుగు వారిని.. అలాగే హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడతను. కొన్ని నెలల కిందటే ‘సార్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్.. పదేళ్ల కిందటే హిందీలో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుల్లో ఒకడైన ఆనంద్.ఎల్.రాయ్‌తో అతను చేసిన ‘రాన్‌జానా’ అక్కడ ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది. ధనుష్ అంటే ఎవరో తెలియని టైంలో ఈ సినిమా రిలీజై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంతో ధనుష్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసిన ఆనంద్.ఎల్.రాయ్.. తర్వాత అతడితో ‘ఆత్రంగి రే’ అనే మరో సినిమా కూడా చేశాడు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పుడు ఆనంద్ ఎల్.రాయ్.. ధనుష్‌తో మరో సినిమా తీయబోతున్నాడు. విశేషం ఏంటంటే.. ఇది ‘రాన్‌జానా’కు ఫ్రాంఛైజీ చిత్రంలా ఉంటుందట. ‘రాన్‌జానా’కు కథ అందించిన హిమాంశు శర్మనే దీనికీ స్క్రిప్టు సమకూరుస్తున్నాడు. ఈ సినిమా గురించి ధనుష్ చాలా ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ‘‘కొన్ని సినిమాలు జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి.
రాన్‌జానా అలాగే మా జీవితాలను మార్చింది. దాన్నొక క్లాసిక్ లాగా మార్చినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. దశాబ్దం తర్వాత మళ్లీ ‘రాన్‌జానా’ ప్రపంచం నుంచి వస్తున్న కథ.. తేరే ఇష్క్ మే. ఈ సినిమాతో ఒక సాహసోపేతమైన ప్రయాణం చేయబోతున్నాం’’ అని ధనుష్ వెల్లడించాడు. ‘రాన్‌జానా’లో ధనుష్ సరసన నటించిన సోనమ్ కపూర్ ఇప్పుడు సినిమాలకు దాదాపుగా దూరం అయిపోయింది. కాబట్టి ఓ కొత్తమ్మాయిని కథానాయికగా తీసుకునే అవకాశముంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు.
This post was last modified on June 23, 2023 10:30 am
కోలీవుడ్ దర్శకులతో మన హీరోలు సినిమాలు చేయడం కొత్తేమి కాదు కానీ ఇటీవలె కొన్ని ఫలితాలు ఆందోళన కలిగించేలా రావడం…
ఏపీలో వలంటీర్ వ్యవస్థపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. వైసీపీ హయాంలో అమలులోకి వచ్చిన ఈ వ్యవస్థ గ్రామాలు, పట్టణాల్లో…
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి ఇంకా పూర్తిగా రిలీఫ్ అయితే దొరకలేదనే చెప్పాలి.…
యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డకు యూత్‌లో బంపర్ క్రేజ్ తీసుకొచ్చి తనను స్టార్‌ను చేసిన సినిమా.. డీజే టిల్లు. ఈ…
మహేష్ బాబు కెరీర్లో పవర్ ఫుల్ హిట్లలో ‘బిజినెస్‌మేన్’ ఒకటి. ‘పోకిరి’ తర్వాత పూరితో మహేష్ చేసిన ఈ సినిమాకు…
గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం సోషల్ మీడియాను ఎలా ఊపేస్తోందో తెలిసిందే. పచ్చళ్ల రేట్లు ఎక్కువ…