స్క్విడ్ గేమ్.. ఓటీటీల చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సిరీస్ ఇది. నెట్ ఫ్లిక్స్ వాళ్లు నిర్మించిన ఈ కొరియన్ సిరీస్ రెండేేళ్ల కిందట విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ సిరీస్ కోసమనే నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లుగా మారిన ప్రేక్షకుల సంఖ్య పెద్దదే. ఇలా ఓ సిరీస్ బ్లాక్ బస్టర్ అయితే.. దానికి కొనసాగింపుగా ఇంకో సీజన్ తీయడం మామూలే.
‘స్క్విడ్ గేమ్’కు కూడా అప్పట్లోనే సెకండ్ సీజన్ అనౌన్స్ చేశారు. దర్శకుడు డాంగ్ హ్యూక్ రెండో సీజన్ గురించి అధికారిక ప్రకటన చేశాడు. షూటింగ్ మొదలవుతోందని, తొలి సీజన్‌కు దీటుగా, ఉత్కంఠభరితంగా రెండో సీజన్ ఉండబోతోందని అతను ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పుడు ‘స్క్విడ్ గేమ్-2’కు సంబంధించి గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న నటీనటుల వివరాలతో పాటు కాన్సెప్ట్ గురించి హింట్ ఇచ్చారు ఈ వీడియోలో.
‘స్క్విడ్ గేమ్’ చూసి థ్రిల్ అయిపోయిన ప్రేక్షకులు రెండో సీజన్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సెకండ్ సీజన్ ఈ నవంబరులోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ‘స్క్విడ్ గేమ్’ కాన్సెప్ట్ చాలా షాకింగ్‌గా ఉంటుంది. మల్టీ మిలియనీర్లయిన కొంతమంది.. డబ్బు కోసం తహతహలాడుతున్న వ్యక్తులను ఎంచుకుని ఒక దీవిలోకి తీసుకొచ్చి వాళ్లతో డేంజరస్ గేమ్స్ ఆడిస్తారు.
ఈ క్రమంలో తప్పులు చేసిన వాళ్లు వరుసగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ డేంజరస్ గేమ్స్ చూసి ఆ మల్టీ మిలియనీర్లు వినోదం పొందుతుంటారు. ఆ గేమ్స్ సాగే వైనం.. తీవ్ర ఉత్కంఠతో ఉంటుంది. ఒక ఎపిసోడ్ మొదలుపెడితే.. అన్నీ చూసేదాకా వదల్లేని థ్రిల్, టెన్షన్ ఉంటుంది ఈ సిరీస్‌లో. మరి రెండో సీజన్లో కథ ఎలా ఉంటుందో.. ఈ సీజన్ ఇంకెంత ఉత్కంఠభరితంగా ఉంటుందో చూడాలి మరి. ఈ సిరీస్ రిలీజైనపుడు మరోసారి ఓటీటీ రికార్డులన్నీ బద్దలు కావడం ఖాయం.
This post was last modified on June 21, 2023 2:52 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…