Movie News

24 గంటల్లో ఆదిపురుష్ సునామి

వేసవి మొత్తం డ్రైగా గడిచిపోయిన బాక్సాఫీస్ కు ఆదిపురుష్ ఎక్కడ లేని ఉత్సాహం తీసుకొస్తున్నాడు. ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు అధికంగా అడ్వాన్స్ బుకింగ్స్ పోటెత్తడం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. ప్రభాస్ ఇమేజ్ తో పాటు రాముడు సెంటిమెంట్ మేజిక్ చేస్తుందని అంచనా వేసినా మరీ ఈ స్థాయిలో కాదని ఒప్పుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో అమ్మకాల అరాచకం మాములుగా లేదు. నాలుగు వందలకు పైగా స్క్రీన్లు తక్కువ పడుతున్నాయంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీకెండ్ మొత్తం ఇదే ట్రెండ్ ఉండబోతోంది.

నార్త్ సైడ్ ప్రేక్షకులు ఆదిపురుష్ పట్ల విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చినా పఠాన్, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 రికార్డులు ఈజీగా లేచిపోతాయి. తెల్లవారుఝామున 4 గంటల నుంచి బెనిఫిట్ షోలు తెలంగాణలో మొదలుకాబోతున్నాయి. ఏపీలో ఇంకా స్పష్టత లేని కారణంగా ప్రస్తుతం 6 కన్నా ముందు ప్రీమియర్లు పడే సూచనలు కనిపించడం లేదు. ఎన్నో నెలల తర్వాత టికెట్ల కోసం తమ ఫోన్లు నాన్ స్టాప్ గా మోగుతున్నాయని బయ్యర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ యజమానులు కాల్స్ కి స్పందించడం కూడా మానేశారు

ఇప్పుడు అందరి దృష్టి టాక్ మీదే ఉండబోతోంది. ముందస్తుగానే ఇన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తుండటంతో ఫలితం కూడా మెరుగ్గా వస్తుందనే నమ్మకం  డార్లింగ్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ట్రైలర్ లో చూసింది నాలుగైదు నిమిషాల కంటెంటే కాబట్టి అసలైన మూడు గంటల నిడివిలో హీరో ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ లు కనికట్టు చేసి ఉంటారని నమ్ముతున్నారు. ఫస్ట్ డే ఓపెనింగ్స్ కి సంబంధించిన ఫిగర్లు కూడా చాలా షాకింగ్ గా ఉండబోతున్నాయి. రేపు ట్విట్టర్, ఇన్స్ టా, ఫేస్ బుక్ వగైరా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ అన్నీ జై శ్రీరామ్ నినాదంతో మారుమ్రోగిపోవడం ఖాయమే 

This post was last modified on June 15, 2023 9:30 am

Share

Recent Posts

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

2 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

2 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

3 hours ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

3 hours ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

4 hours ago

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

4 hours ago