రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని ఆశిస్తున్న కార్పొరేటర్లకు మంత్రి కేటీయార్ సీరియస్ వార్నిగ్ ఇచ్చారు. కార్పొరేటర్లు ఎవరు కూడా ఎంఎల్ఏ టికెట్లకోసం ప్రయత్నాలు చేయద్దని, ఉన్నవాళ్ళని ఇబ్బందులు పెట్టవద్దని గట్టిగా హెచ్చరించారు. ఈనెల 16వ తేదీనుండి వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నేపధ్యంలో వచ్చేఎన్నికల్లో టికెట్ల విషయమై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
గ్రేటర్ లో బీఆర్ఎస్ కు 56 మంది కార్పొరేటర్లున్నారు. వీరిలో కనీసం 10 మంది ఎంఎల్ఏ టికెట్లు ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏలపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేసీయార్ చేయిస్తున్న సర్వేల్లో నెగిటివ్ వస్తున్నదని కొందరిపై బాగా ప్రచారం జరుగుతోంది. అలాంటి నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయంగా కేసీయార్ వేరే నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. ఎలాగూ ప్రత్యామ్నాయాలు చూస్తున్నారు కాబట్టి పోటీకి సిద్ధంగా ఉన్న కొందరు కార్పొరేటర్లు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
కార్పొరేటర్ల ప్రయత్నాలతో సిట్టింగ్ ఎంఎల్ఏలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇదే విషయమై కేటీయార్ స్పష్టతిచ్చారు. అనవసరంగా సిట్టింగ్ ఎంఎల్ఏల్లో టెన్షన్ పెంచేసి ఇబ్బందులు పెట్టవద్దన్నారు. టికెట్ల వ్యవహారం పార్టీ అధినేత కేసీయార్ చూసుకుంటున్నపుడు మధ్యలో కార్పొరేటర్లు ఎందుకు గోలచేస్తున్నారంటు క్లాసుపీకారు. సిట్టింగుల్లో ఎవరికి టికెట్లివ్వాలి ? ఎవరికి ఇవ్వద్దు ? ప్రత్యామ్నాయంగా ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయాలను కేసీయార్ చూసుకుంటున్నారు కాబట్టి పార్టీలో అనవసరంగా కంపుచేయద్దని కేటీయార్ వార్నింగ్ ఇచ్చారు.
కేటీయార్ తాజా వార్నింగ్ తో చాలామంది కార్పొరేటర్లలో నిరుత్సాహం మొదలైంది. బాగా డబ్బున్న కార్పొరేటర్లు ఎంఎల్ఏగా పోటీచేయటానికి రెడీ అయిపోయారు. తమ డివిజన్లలో ఏ కార్యక్రమం జరిగినా జనాల్లో దృష్టిలో పడేందుకు దాన్ని పెద్దగా ఫోకస్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలో కార్పొరేటర్లందరు పార్టీకి పనిచేయాల్సిందే అని, కేసీయార్ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపుకు కష్టపడాలని స్పష్టంగా చెప్పేశారు. పార్టీ లైన్ దాటిన వారిపైన యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on June 14, 2023 12:06 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…