ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను పాల్గొన్న ప్రతి సమావేశంలోనూ ధరణి గురించి గొప్పలు చెబుతున్నారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ధరణిని బరాబర్ రద్దు చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ తీరుపై కేసీఆర్ గుస్సా అవుతున్నారు. ధరణితో తీసుకొచ్చిన మార్పులు.. చేసిన ప్రక్షాళన గురించి కేసీఆర్ గొప్పలు చెబుతుంటే… దీనివల్ల ప్రజలకు ఎంత ఇబ్బందో వివరిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది చాలారోజుల నుంచి నడుస్తున్నదే. అయితే… తాజాగా రేవంత్ రెడ్డి ధరణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ధరణి పోర్టల్ ను ‘‘ఇన్ ఫ్రాస్టక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్’’ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించిన విషయాన్ని రేవంత్ వెల్లడించారు. తెలంగాణ ప్రజల భూముల వివరాల్ని ప్రైవేటు సంస్థ చేతిలో ఎలా పెడతారు? అని ప్రశ్నిస్తున్నారు. ఐఎల్ఎఫ్ సంస్థలో ఫిలిప్పీన్ కు చెందిన కంపెనీల పెట్టుబడులు ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రజల భూముల వివరాల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఇదే ప్రమాదకరం ధరణి నిర్వాహణపై ఐఎల్ఎఫ్ సంస్థతో రూ.150 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థకు చెందిన 99 శాతం వాటాను టెరాలసిస్ టెక్నాలజీస్ అనే సంస్థ కొనుగోలు చేసింది. రాష్ట్రంలోని 70 లక్షల మంది భూ యజమానుల వివరాల్ని ఐఎల్ఎఫ్ సంస్థకు విక్రయించారు’’ అంటూ పేర్కొన్నారు.
రేవంత్ వ్యాఖ్యల్ని భూ యజమానుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని భూముల యజమానుల వివరాలతో కూడిన సున్నిత సమాచారాన్ని ప్రైవేటు సంస్థకు కాకుండా ప్రభుత్వమే ఎందుకు నిర్వహించటం లేదన్న సందేహం కలుగక మానదు. ధరణిపై కొత్త పాయింట్ ను తెర మీదకు తీసుకొచ్చిన రేవంత్.. ముఖ్యమంత్రి కేసీఆర్ మోసాల్ని భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదన్న రేవంత్.. తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి రేవంత్ కొత్త సవాలు విసిరారు. రాష్ట్రంలో ఏ గ్రామం అయినా సరే.. డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించిన గ్రామం అయినా సరే… ఆ గ్రామానికి వెళ్లి బీఆర్ఎస్ ఓట్లు అడిగే ధైర్యం చేస్తుందా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని.. మరి.. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో ఓట్లు అడగటానికి ఇంద్రకరణ్ రెడ్డి సిద్ధమా? అని సవాలు విసిరారు.
కేసీఆర్ చేతిలో మోసపోయిన వారి జాబితాలో శ్రీహరిరావు మొదట్లో ఉంటారన్నారు. నిర్మల్ జిల్లా నుంచి కాంగ్రెస్ లో చేరిన శ్రీహరి రావుకు సాదర స్వాగతం పలుకుతున్నట్లుగా పేర్కొన్న రేవంత్.. ఆయనతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి.. ఈ ఘాటు సవాలు విసిరారు. మరి.. దీనికి మంత్రి ఇంద్రకరణ్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
This post was last modified on June 15, 2023 9:20 am
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…