ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలు కావడానికి చాలా సమయం పడుతుంటే అభిమానులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ షూట్ పూర్తయ్యాక ఏడాదిన్నరకు కానీ కొరటాల శివ దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేకపోయాడు. కానీ ‘ఆర్ఆర్ఆర్’లో మరో హీరోగా నటించిన రామ్ చరణ్ పెద్దగా గ్యాప్ తీసుకోకుండా.. శంకర్ డైరెక్షన్లో సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లిపోయాడు.
చకచకా కొన్ని షెడ్యూళ్లు కూడా పూర్తి చేశాడు. చరణ్ సినిమా వేగం చూసి తారక్ ఫ్యాన్స్ మరింత ఫీలయ్యారు. కానీ తర్వాత చూస్తే పరిస్థితి మారిపోయింది. ‘ఇండియన్-2’ అడ్డం పడటంతో ‘గేమ్ చేంజర్’ వేగం పడిపోయింది. చరణ్, దిల్ రాజుల అంగీకారంతోనే శంకర్ ఆ ప్రాజెక్టును కూడా సమాంతరంగా పూర్తి చేయడానికి పూనుకున్నప్పటికీ.. రెండు సినిమాలతో సమన్వయం చేసుకోవడంలో శంకర్ ఇబ్బంది పడుతున్నట్లే కనిపిస్తోంది.
ఈ మధ్య అసలు ‘గేమ్ చేంజర్’ వార్తల్లోనే లేకుండా పోయింది. ఆ సినిమా షూటింగ్ గురించి కూడా పెద్దగా అప్‌డేట్స్ రావట్లేదు. ఈ ఏడాది సంక్రాంతికే అనుకున్న సినిమా కాస్తా.. వచ్చే సంక్రాంతికి కూడా రాదని తేలిపోయింది. కనీసం వచ్చే వేసవికైనా సినిమాను సిద్ధం చేయగలరా అన్న సందేహం కలుగుతోంది. ప్రస్తుతానికి ‘ఇండియన్-2’ మీదే శంకర్ ఫోకస్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి శంకర్ కష్టపడుతున్నాడు.
పోస్ట్ ప్రొడక్షన్ పనిని వేరే వాళ్లకు అప్పగించే రకం కాదు శంకర్. తన సినిమాకు సంబంధించి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాడు. ఇలా ‘ఇండియన్-2’ మీద ఆయన ఫోకస్ పెరిగిపోవడంతో ‘గేమ్ చేంజర్’ బాగా ఆలస్యం అవుతోంది. మరోవైపు ‘దేవర’ను తారక్ చకచకా పూర్తి చేస్తున్నాడు. అనుకున్నట్లే వచ్చే మే 5న ఆ సినిమా రిలీజ్ కాబోతోంది. లేటుగా షూట్ మొదలైనప్పటికీ చరణ్ కంటే తారక్ సినిమానే ముందు రిలీజయ్యేలా కనిపిస్తోంది.
This post was last modified on June 13, 2023 1:52 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…