నిన్న విడుదలైన వాటిలో చాలా తక్కువ ప్రమోషన్లతో వచ్చిన సినిమా ఇంటింటి రామాయణం. హడావిడి నిర్ణయం కావడంతో టైం సరిపోని కారణంగా పబ్లిసిటీ ఎక్కువ చేయలేకపోయారు. వాస్తవానికి ఇది ముందు ఆహా ఓటిటి కోసమని ప్లాన్ చేశారు. కానీ బలగం సక్సెస్ చూశాక తెలంగాణ బ్యాక్ డ్రాప్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతుందని గుర్తించి థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. మొన్నే ఒకటి రెండు చోట్ల ప్రీమియర్లు వేశారు కానీ దాని తాలూకు సందడి సోషల్ మీడియాలో కనిపించలేదు. ఇంతకీ ఇంటింటి రామాయణంలో మ్యాటరుందానే ఆసక్తి కలగడం సహజం
నలుగురికి మంచి చేస్తూ సహాయ పడే రాములు(నరేష్)కి ఊరంతా చుట్టాలే. ఎదురింట్లో ఉండే శ్రీనివాస్(రాహుల్ రామకృష్ణ) తన కూతురు సంధ్య(నవ్య స్వామి)కి లైన్ వేస్తున్నా గుర్తు పట్టలేనంత అమాయకత్వంలో బ్రతుకుతుంటాడు. ఇలా వీళ్ళ జీవితాలు సాఫీగా సాగిపోతూ ఉండగా రాములు ఇంట్లో విలువైన బంగారం చోరీ అవుతుంది. ఎవరు కొట్టేశారో పట్టుకునే దిశలో అయినవాళ్ల మీదే అనుమానం వస్తుంది. దొంగెవరో తెలుసుకునే క్రమంలో జరిగే సంఘటనలే ఇంటింటి రామాయణం. ఫస్ట్ హాఫ్ సరదాగా నడిచే సన్నివేశాలతో దర్శకుడు సురేష్ నరెడ్ల టైం పాస్ అయితే చేయించాడు
సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి బలమైన కంటెంట్ లేకపోవడంతో రిపీట్ అనిపించే సన్నివేశాలతో బోర్ కొట్టించేస్తాడు. నేటివిటీని చక్కగా చూపించినా అవసరం లేని సాగతీత ఫ్లోని దెబ్బ తీసింది. పైగా క్లైమాక్స్ కూడా ఏమంత కన్విన్సింగ్ గా ఉండదు. ఇంకేదో ట్విస్టు ఎక్స్ పెక్ట్ చేస్తాం కానీ అది నిరాశ పరుస్తుంది. నరేష్ తో సహా ఆరిస్టులందరూ చక్కగా నటించినప్పటికీ దర్శకుడి తడబాటు వల్ల టికెట్ సొమ్ములకు న్యాయం జరిగినట్టు అనిపించదు. తెలంగాణ మీద అభిమానం, బోలెడంత ఓపిక ఉంటే ఓసారి ట్రై చేయొచ్చు కానీ ఇంటింటి రామాయణంలో బిగ్ స్క్రీన్ మ్యాటర్ అయితే పెద్దగా లేదు
This post was last modified on %s = human-readable time difference 10:03 pm
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం…
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…