నిన్న గ్రాండ్ గా జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సైఫ్ అలీఖాన్ రాకపోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్ లోనూ తొలి రెండు మూడు షాట్లలో చూపించి తర్వాత మాయం చేయడం వెనుక అంతరార్థం అభిమానులకు అంతు చిక్కడం లేదు. అయితే దీని వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉన్నట్టు తెలిసింది. టీజర్ వచ్చిన కొత్తల్లో ఎక్కువ నెగటివిటీ వచ్చింది పది తలల రావణుడి లుక్స్ మీదే. సైఫ్ అసలు సూట్ కాలేదని, గెడ్డం గెటప్ ఏదో ముస్లిం చక్రవర్తిని తలపిస్తున్నాయని కామెంట్స్ వినిపించాయి. హనుమంతుడి మీద సైతం విమర్శలు వచ్చాయి
వీటిని సీరియస్ గా తీసుకున్న టీమ్ రిపేర్లు బాగానే చేసింది. హనుమాన్ మీద డౌట్లు క్లియరయ్యాయి. ఎటొచ్చి రావణుడిని బిక్షగాడి గెటప్ లో చూపించడం తప్ప ఇంకేం రివీల్ చేయలేదు. అయితే దర్శకుడు ఓం రౌత్ చాలా పవర్ ఫుల్ గా ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేశాడని, పది తలలతో సైఫ్ అలీ ఖాన్ ని చూపించే ఎపిసోడ్ ఓ రేంజ్ లో వచ్చిందని, అలాంటి సర్ప్రైజ్ లన్నీ థియేటర్ లో ఇస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో దాచి ఉంచారట. పైగా హైదరాబాద్ ఓ ఈవెంట్ లేదా విజయోత్సవ వేడుక ఒకటి చేయాలనే ప్లాన్ లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా సైఫ్ వచ్చేలా ప్లాన్ చేశారట
ఏది ఏమైనా అతను రాకపోయినా నిన్న గెస్టులెవరూ తమ స్పీచుల్లో సైఫ్ ప్రస్తావన తీసుకురాకపోవడం మరో ట్విస్టు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రావణుడి స్క్రీన్ టైం ఎక్కువ సేపు ఉండదట. సీతను ఎత్తుకుపోయే ఎపిసోడ్ కూడా విశ్రాంతికి ముందు వస్తుందని, అక్కడ ఇంటర్వెల్ కార్డు వేసి సైఫ్ ఎంట్రీ మొదలుపెడతారని తెలిసింది. రాముడు సీత మధ్య వనవాసం, అడవిలో వాళ్ళు గడిపిన కాలం, సీతను తీసుకొచ్చే క్రమంలో రాముడు చేసే ప్రయాణం ఇవి ఎక్కువ లెన్త్ తో ఉంటాయట. సైఫ్ చివరి ఆరగంట ప్రభాస్ తో సమానంగా కనిపిస్తాడని అంటున్నారు. మొత్తానికి రాకపోయినా సరే సైఫ్ టాక్ అఫ్ ది ఈవెంట్ అయ్యాడు