‘గుంటూరు కారం’ అదొక్కటే మిస్సింగ్ 

మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ టైటిల్ గ్లిమ్స్ భారీ వ్యూస్ కొల్లగొడుతూ దూసుకెళ్తుంది. ముందే లీక్ అవ్వడంతో ఫ్యాన్స్ కి టైటిల్ పెద్దగా కిక్ ఇవ్వలేదు. కానీ గ్లిమ్స్ లో కొన్ని మాస్ షాట్స్ , మహేష్ ప్రెజెన్స్ మాత్రం సూపర్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాయి. రౌడీలతో మహేష్ ఆటాడుకుంటూ కొడుతూ వచ్చే షాట్స్ దానికి తమన్ నేపథ్యం ఎట్రాక్ట్ చేశాయి. మహేష్ బీడీ వెలిగించుకోవడం , చివర్లో గుంటూరు మిర్చి యార్డ్ లో నడుచుకుంటూ వచ్చే శాట్ హైలైట్ గా నిలిచాయి. 

ఇలా అంతా బాగానే ఉంది. కానీ మహేష్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఊహించే త్రివిక్రమ్ పంచ్ డైలాగ్ ఇందులో పడలేదు. బీడీ త్రీడీ అనే ప్రాస తో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఫ్యాన్స్ ను మెప్పించలేకపోయింది. పైగా త్రివిక్రమ్ నుండి ఇలాంటి పేలవమైన డైలాగ్ ఎలా వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు జనాలు. 

‘గుంటూరు కారం’ అంటూ మహేష్ మాస్ స్ట్రైక్ బాగానే ఉంది కానీ ఇందులో త్రివిక్రమ్ మార్క్ అదిరిపోయే డైలాగ్ ఒక్కటి మహేష్ నోటి నుండి వచ్చుంటే గ్లిమ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. ఓవరాల్ గా మాస్ గ్లిమ్స్ బాగానే ఉంది కానీ అదొక్కటే మిస్సింగ్ అన్నట్టుగా త్రివిక్రమ్ పెన్ వైపు చూస్తూ మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. ఇక  ఈ సినిమాకు ఎన్టీఆర్ ‘రాఖీ’ ట్యాగ్ లైన్ వాడేశారని కూడా నెటిజన్లు త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తున్నారు. బహుశా ఇది కో ఇన్సిడెంట్ అనుకోవచ్చు. త్రివిక్రమ్ వంటి అగ్ర దర్శకుడు తెలిసి తెలిసి ఆల్రెడీ ఓ సినిమాకి వాడిన ట్యాగ్ లైన్ పెట్టకపోవచ్చు.