జూనియర్ ఆర్టిస్ట్ గా నితిన్ 

వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. సొంత బేనర్  శ్రేష్ట్ మూవీస్ పై నితిన్ చేస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడట. నితిన్ ను సినిమా పిచ్చోడికి చూపిస్తూ షూటింగ్ సీన్ డిజైన్ చేశారట వక్కంతం. అందులో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా మంచి ఎంటర్టైన్ మెంట్ పండించాడని తెలుస్తుంది. కెమెరాలో పడాలనే నితిన్ తాపత్రయం చూసి నవ్వుకోవడం పక్కా అట. 

అయితే వక్కంతం తీస్తున్న ఈ సినిమాలో కొంత వరకే సినిమా నేపథ్యం ఉంటుందని తెలుస్తుంది. మిగతా భాగమంతా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా ఒక హీరో జూనియర్ అరిస్ట్ గా కనిపించడం అంటే స్క్రీన్ పై మంచి ఎంటర్టైన్ మెంట్ పండుతుంది. సినిమా షూటింగ్ లో బ్యాక్ గ్రౌండ్ లో కనిపించే జూనియర్ ఆర్టిస్ట్ ల బాధను ఈ సినిమాలో ఫన్నీ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కాబోలు వక్కంతం. 

సినిమా నేపథ్యంతో పూరీ జగన్నాథ్ ఆ మధ్య ‘నేనింతే’ తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత సినిమా బ్యాక్ డ్రాప్ తో చెప్పుకోదగిన మరో మూవీ రాలేదు.  అయితే వక్కంతం ఇందులో సినిమా నేపథ్యాన్ని కేవలం వినోదం కోసమే తీసుకున్నట్లు సమాచారం. అంటే షూటింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ , సీనియర్ ఆర్టిస్ట్ మధ్య జరిగే సన్నివేశాల వరకూ ఉండవచ్చు. అలాగే సినిమాలో ఓసారి కనిపించాలనే కుర్రాడి తపనను చూపిస్తుండవచ్చు అంతకుమించి ఉండకపోవచ్చు.