బండ్ల గణేష్ గిఫ్టు పంచు పేలిందిగా

స్టేజి మీదే కాదు ట్విట్టర్ లోనూ బండ్ల గణేష్ ఫైర్ మాములుగా ఉండదు. ఏది అనిపిస్తే అది పెట్టేయడం అవసరమైతే మీడియాతోనూ రచ్చ చేసుకోవడం తనకలవాటే. రాజకీయంలో ఉన్నప్పుడూ అంతే. ప్రస్తుతం సినిమాల నిర్మాణం నుంచి బ్రేక్ తీసుకున్న బండ్లన్న రవితేజతో ఓ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ తీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఫైనల్ కాలేదు కానీ తరచు కలుసుకుంటూ రెగ్యులర్ టచ్ లో ఉన్న మాట వాస్తవం. ఈ ఇద్దరి కలయికలో ఆంజనేయులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆశించిన ఫలితం దక్కలేదు కానీ మంచి ఫన్ ఉంటుంది.

సరే ఈ విషయాలు కాసేపు పక్కనపెడితే తాజాగా బండ్ల గణేష్ ఓ మూవీ లవర్ కి ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. సతీష్ సుంకర అనే వ్యక్తి తనకు ప్రొడ్యూసర్ కావాలని ఉందని ఎలా అవ్వాలో టిప్స్ ఇమ్మని అడిగాడు. దీనికి గణేష్ సమాధానమిస్తూ గురూజీకి ఒక ఖరీదైన కానుక ఇస్తే పనైపోతుందని హింట్ ఇచ్చాడు. ఇది ఎవరి గురించో ఫ్యాన్స్ ఈజీగా గుర్తుపట్టేశారు. ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలోనూ గురూజీ అంటే త్రివిక్రమ్ కు వాడే ఉపమానం. పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు తనను పిలవకపోవడం వెనుక ఆయన హస్తమే ఉందని గణేష్ ఎప్పటి నుంచో ఇన్ డైరెక్ట్ గా అంటున్నారు

అయినా గిఫ్ట్ ఇస్తే నిర్మాత అయిపోవచ్చనే దాంట్లో లాజిక్ చాలా నర్మగర్భంగా ఉంది. తాను ఇవ్వడం లేదు కాబట్టే పవన్ తో చేయాలనుకున్న మూడో సినిమా పట్టాలు ఎక్కడం లేదనా లేక ఇప్పుడు చేస్తున్న ప్రొడ్యూసర్లు అలాంటివి ఇచ్చారని చెప్పడం ఉద్దేశమా. ఏదైతేనేం నెటిజెన్లకు మరో టాపిక్ అయితే ఇచ్చేశాడు. గురూజీ అనడం తప్ప నేరుగా త్రివిక్రమ్ పేరుని ప్రస్తావించడం లేదు కాబట్టి దీన్ని ఎవరికైనా అన్వయించుకోవచ్చు కానీ క్లియర్ గా అర్థమవుతున్నప్పుడు ఎవరికైనా ఎందుకు డౌట్ వస్తుంది. ఎవరికి వారు దీన్ని రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు