పవన్‌కళ్యాణ్‌తో హరీష్ శంకర్ సినిమా వుంటుందని తెలిసిన దగ్గర్నుంచి ఫాన్స్‌లో ఉత్సాహం ఉరకలేస్తోంది. పవన్‌కళ్యాణ్‌ని అభిమానులు తెరపై ఎలా చూడాలని అనుకుంటారో హరీష్ శంకర్ అలాంటి సినిమా తీసి ‘గబ్బర్‌సింగ్’తో పవన్‌కళ్యాణ్ అంటే ఏమిటో మరోసారి బాక్సాఫీస్‌కి చూపించాడు. కమర్షియల్ మసాలాపై మంచి పట్టున్న హరీష్ మరోసారి పవన్‌తో అలాంటి మ్యాజిక్ చేస్తాడని ఫాన్స్ ఆశ పడుతున్నారు.
అయితే ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ పొలిటీషియన్‌గా కనిపిస్తాడని, ఒక సామాన్యుడు రాజకీయ నాయకుడైతే ఏ విధంగా ప్రజలకు మంచి జరుగుతుందో, అలాగే ఏ విధంగా అవినీతికి చరమగీతం పాడతాడో ఈ చిత్రంలో చూపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేన మళ్లీ ఎన్నికలకు వెళ్లే సమయానికి ఈ చిత్రం వల్ల చాలా బెనిఫిట్ అవుతుందని కూడా అంటున్నారు.
అయితే గతంలో ఇలాంటి ప్రచారమే జరిగినపుడు తాను ఎలాంటి రాజకీయాల జోలికి పోవడం లేదని, పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా తీస్తానని హరీష్ శంకర్ చెప్పాడు. ఆ తర్వాత హరీష్ నుంచి ఈ చిత్రం గురించిన అప్డేట్స్ ఏమీ లేకపోవడంతో మరోసారి కథాంశం గురించిన ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates