నయనతారకి ఫైనల్‌గా దర్శకుడు విఘ్షేష్ శివన్ రూపంలో ఒక స్టేబుల్ పార్టనర్ దొరికాడు. అంతకుముందు శింబు, ప్రభుదేవాతో రిలేషన్స్ తో నయనతారకు చేదు అనుభవం ఎదురయింది. వాళ్లతో ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నయనతార ఆరాట పడింది. విఘ్నేష్‌తో ఇప్పటికే చాలా ఏళ్లుగా రిలేషన్లో వున్నా కానీ పెళ్లి జోలికి వెళ్లడానికి ఆమె ముందడుగు వేయడం లేదు.
పెళ్లి కాలేదు కానీ వీరిద్దరూ చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. త్వరలో నయనతార పెళ్లి అంటూ పలుమార్లు మీడియాలో వార్తలొస్తుంటాయి కానీ నయనతార మాత్రం ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు లేదు. సహజీవనంతో హ్యాపీగానే వుంది కనుక ఇప్పుడు లీగల్లీ వెడ్డెడ్ అనిపించుకోవాల్సిన తొందర ఏమిటనేది ఆమె ఫీలింగ్ కావచ్చు. మరోవైపు నయనతారకు తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలలో ఇంకా డిమాండ్ అలాగే వుంది. పైగా తనకు నచ్చిన విధంగా, అడిగినంత పారితోషికం కూడా తీసుకుంటూ సినిమాలు చేస్తోంది.
ఇలాంటి టైమ్‌లో పెళ్లి చేసుకుంటే ఇక తనకి ఈ స్థాయిలో అవకాశాలు రావని నయనతారకు తెలుసు. సమంత లాంటి మంచి పొజిషన్లో వున్న నటి కెరియర్ ఇప్పుడెలా కుంటుపడిందనేది తెలిసిందే. అందుకే నయనతార పెళ్లి ఆలోచన చేయకుండా సహజీవనంతోనే సాఫీగా బండి లాగేస్తోందని టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates