ఈ ఏడాది జనవరి 26న రిలీజైన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రకంపనలు రేపిందో తెలిసిందే. హిందీ సినిమాలకు కొవిడ్ తర్వాత వంద కోట్ల వసూళ్లు కూడా చాలా కష్టమైపోతున్న సమయంలో పఠాన్ మాత్రం ఏకంగా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఔరా అనిపించింది.
ఇలాంటి మెగా హిట్ తర్వాత షారుఖ్ నటిస్తున్న సినిమా కావడం, పైగా సౌత్ ఇండియన్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తుండటంతో జవాన్ మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. కమర్షియల్ సినిమాలు తీయడంలో నిపుణుడైన దర్శకుడితో షారుఖ్ జత కడితే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం ఉంటుందో అంచనా వేయొచ్చు. ఆ విధ్వంసాన్ని జూన్ 2నే చూడొచ్చని ఆశపడ్డారు అభిమానులు. కానీ ఆ డేట్‌కి సినమా రావడం లేదు.
షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో జవాన్ సినిమాను వాయిదా వేశారు. కొత్త డేట్ కోసం అందరూ ఎదురు చూస్తుండగా.. ఆ కబురు ఈ రోజు చెప్పేశారు. ముందు అనుకున్న దాని కంటే 3 నెలలు ఆలస్యంగా సెప్టెంబరు 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో ఈ విషయాన్ని వెల్లడించారు.
సెప్టెంబరు 28న సలార్ లాంటి భారీ చిత్రం విడుదల కానుండగా.. అంతకు మూడు వారాల ముందే షారుఖ్ తన సినిమాను థియేటర్లలో దించలేకపోతున్నాడు. ఈ సినిమాకు మంచి టాక్ వస్తే మూడు వారాలు చాలు వసూళ్ల మోత మోగించుకోవడానికి. జవాన్ మూవీలో షారుఖ్ సరసన నయనతార కథానాయికగా నటిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడిగా బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. ఈ చిత్రాన్ని షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.
This post was last modified on May 7, 2023 6:57 am
వైసీపీ నాయకుడు, వివాదాస్పద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దువ్వాడ మాధురిని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం…
ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు.…
కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే.…
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…