శాన్వి శ్రీవాత్సవ.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు ఇంకా గుర్తుండే ఉంటుంది. ‘లవ్లీ’ లాంటి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో టాలీవుడ్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్ బ్యూటీ.. తర్వాత అదే స్థాయిలో మరి కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ తర్వాతి సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అదే సమయంలో శాన్వికి కథానాయికగా ప్రత్యేకమైన గుర్తింపూ రాలేదు. ఇటు నటిగా పేరు తెచ్చుకోలేక, అటు గ్లామర్ ముద్రా వేయలేక చాలా త్వరగా కనుమరుగైపోయింది ఈ భామ. కానీ తెలుగు వాళ్లు పట్టించుకోకపోయినా.. కన్నడిగులు ఈ అమ్మాయిని నెత్తిన పెట్టుకున్నారు. అక్కడ కొంచెం పెద్ద స్థాయి సినిమాల్లో నటించడమే కాక విజయాలు కూడా అందుకుంది.
తెలుగుతో పోలిస్తే అక్కడ గ్లామరస్‌గానూ కనిపించింది శాన్వి. తాజాగా శాన్వి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో చూస్తే ఆమెలో ఇంత హాట్నెస్ ఉందా అని తెలుగు ప్రేక్షకులు షాకవుతారేమో. బీచ్ ఒడ్డున బికినీతో వయ్యారాలు ఒలకబోస్తూ తన ఫాలోవర్లకు చెమటలు పట్టించేసింది శాన్వి. ఇందులో తన ముఖం కనిపించట్లేదు, ఫొటో కూడా సైడ్ యాంగిల్లో ఉంది కానీ.. ఒంపుసొంపుల హొయలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి.
ఈ ఫొటో చూసి.. ఈ మాత్రం హాట్నెస్ తెలుగులో సినిమాలు చేస్తుండగానే చూపించి ఉంటే మన వాళ్లు మంచి బ్రేక్ ఇచ్చేవాళ్లే అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. తెలుగులో తనకు సరైన కెరీర్ లేనందుకు ఆ మధ్య ‘అతనే శ్రీమన్నారాయణ’ సినిమా తెలుగు వెర్షన్ ప్రమోషన్ల టైంలో శాన్వి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం.
This post was last modified on April 26, 2023 4:03 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…