ఎంత రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులు అయినా సరే పంపకాల విషయంలో కొట్టుకోవడాలు హత్యలు చేసుకోవడాలు దాకా వెళ్లే సమాజంలో ఉన్నాం మనం. ఇలాంటివి కేవలం మధ్య తరగతి జనాల్లోనే ఉంటాయనుకుంటే తప్పు. అన్ని కుటుంబాల్లోనూ చూడొచ్చు. అలాంటిది అక్కకి తన ప్రేమ చూపించుకోవడం కోసం చెల్లి ఏకంగా కోట్ల విలువైన ఆస్తిని కానుకగా ఇవ్వడం మాత్రం చాలా అరుదు. అది కూడా పుట్టినరోజు సందర్భంగా కావడం మరో విశేషం. బాలీవుడ్ టాప్ హీరోయిన్, ఆర్ఆర్ఆర్ కథానాయకి అలియా భట్ ఈ వార్త మీదే హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవలే అలియా ముంబైలో 38 కోట్ల విలువైన ఫ్లాట్లు కొనుక్కుంది. ముంబై బాంద్రా వెస్ట్ లోని ఖరీదైన ప్రాంతం పాలీ హిల్స్ లో వీటిని సొంతం చేసుకుంది. 2497 చదరపు అడుగుల్లో ఉన్న ఈ ఆస్తికి అక్కడి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. వాటికైన స్టాంప్ డ్యూటీనే 2 కోట్ల 26 లక్షలంటేనే ఏ రేంజ్ ప్రాపర్టీనో అర్థం చేసుకోవచ్చు. వీటిని కొనుక్కున్న రోజే అక్కకి బర్త్ డే గిఫ్ట్ గా రెండు ఫ్లాట్లు ఇచ్చేసింది. వాటి విలువ అక్షరాలా 8 కోట్లు. షహీమ్ భట్ కి ఇచ్చిన ఫ్లాట్లు జుహూ ఏరియాలోని సెలబ్రిటీలు ఉండే ఏబి నాయర్ రోడ్ లో ఉన్న ప్రీమియం అపార్ట్ మెంట్స్ లో ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో అలియా బిజినెస్ లో పెట్టుబడుల కన్నా ఇలా ఫ్లాట్లు కొనుగోలు చేయడం మీద ఆసక్తి చూపిస్తోంది. కాజోల్, అనుష్క శర్మ, అజయ్ దేవగన్, తమన్నా తదితరులు కూడా ఇదే రూటు పట్టారు. ఆ మధ్య రణ్వీర్ సింగ్ దీపికా పదుకునేలు 119 కోట్ల ఖరీదు చేసే క్వాడ్రాప్లెక్స్ ప్లాట్ లను కొనడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాణ సంస్థలు ఇబ్బడిముబ్బడి రెమ్యునరేషన్లు పెంచేయడంతో హిందీ స్టార్ల పంట పండుతోంది. ఒక సినిమా సైన్ చేస్తే చాలు పదిహేను నుంచి వంద కోట్ల దాకా పారితోషికాలు ఇస్తుండటంతో ఇలా కొనడంలో ఆశ్చర్యమేముంది.
This post was last modified on April 26, 2023 4:06 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…