ప్రస్తుతం యాంకర్స్ కాకుండా దర్శకులు హీరోలను ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేస్తూ ట్రెండ్ నడుస్తోంది. అనీల్ రావిపూడి, హరీష్ శంకర్ వంటి దర్శకులు మిగతా హీరోల సినిమాలను ప్రమోట్ చేసేందుకు ఎప్పుడో యాంకర్ అవతారమెత్తారు. తాజాగా ఈ లిస్ట్ లో దర్శకుడు తేజ కూడా చేరాడు. అయితే తేజ ముక్కుసూటి మనిషి అనే విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. ఏ మాత్రం భయపడకుండా మాట్లాడే గుణం కలిగిన తేజ తో ఇంటర్వ్యూ అంటే మామూలుగా ఉంటుందా ?
త్వరలోనే రామబాణం అనే సినిమాతో గోపీచంద్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తేజ గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేశారు. అందులో గోపీచంద్ ను నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటూ నేరుగా అడిగేశారు. ఆ మధ్య గోపీచంద్ కి తేజ ఓ స్టోరీ చెప్పారు. అలివేలు మంగ వెంకటరమణ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ ఆ సినిమా ఎందుకో సెట్స్ పైకి వెళ్లలేదు. ఆ విషయన్నే ఇంటర్వ్యూలో నేరుగా గోపీచంద్ ను తేజ అడిగాడు.
తనను పక్కన పెట్టి మరో దర్శకుడితో సినిమా చేయడంపై సూటిగా ప్రశ్నించారు. “మీ నాన్న గొప్పోడు నువ్వేం పీకావ్ ” అంటూ గోపీచంద్ ను తేజ అడగడం ఇందులో హైలైట్ అయింది. ఆ బీట్ తో ప్రోమో రిలీజ్ చేశారు. తేజ అడిగిన ఈ సూటి ప్రశ్నకి గోపీచంద్ ఏం సమాదానం చెప్పాడో ఫుల్ ఇంటర్వ్యూలో చూస్తే తెలుస్తుంది. ఇక హీరోగా ఒక సినిమా చేసిన గోపీచంద్ ను విలన్ గా మార్చి జయం సినిమాలో అవకాశం ఇచ్చాడు తేజ. అక్కడి నుండి గోపీచంద్ కెరీర్ టర్నింగ్ అయింది. ఆ తర్వాత హీరోగా మారి పలు హిట్ సినిమాలు చేశాడు. ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. రామ బాణం తనకి సక్సెస్ ఇస్తుందని నమ్మకంతో ఉన్నాడు మాచో స్టార్.
This post was last modified on April 26, 2023 7:49 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…