Movie News

చిచ్చు పెట్టిన ‘వీరసింహారెడ్డి’ పోస్టర్

ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు రిలీజవ్వడానికి కొన్ని నెలల ముందు నుంచే చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య చిచ్చు రేగిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో దేనిది ఆధిపత్యం అనే విషయంలో సోషల్ మీడియా వేదికగా నెలల తరబడి కొట్టుకున్నారు. ఇక రిలీజ్ తర్వాత అయితే ఆ వార్ పీక్స్‌కు చేరింది.

చివరికి చూస్తే వసూళ్ల పరంగా ‘వీరసింహారెడ్డి’ మీద ‘వాల్తేరు వీరయ్య’ స్పష్టమైన పైచేయి సాధించింది. ఆ సమయంలో చిరు అభిమానులు కాలర్ ఎగరేస్తే.. బాలయ్య ఫ్యాన్స్ కొంచెం వెనక్కి తగ్గారు. ఐతే ఆ గొడవ ఎప్పుడో సద్దుమణిగిందిలే అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ కొత్త రచ్చ మొదలవడం చర్చనీయాంశం అయింది. ‘వీరసింహారెడ్డి’ వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ సిటీలో వెలసిన పోస్టర్లు ఈ రచ్చకు కారణం అయ్యాయి. ఈ పోస్టర్ మీద ‘100 డేస్ విత్ సింగిల్ హ్యాండ్’ అని వేయడం దుమారం రేపింది.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవే లీడ్ హీరో అయినా.. రవితేజ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో దాన్ని మల్టీస్టారర్‌గా పేర్కొంటూ.. ఆ సక్సెస్ క్రెడిట్‌ను రవితేజకు కూడా షేర్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. చిరు.. రవితేజ సపోర్ట్‌తోనే బిగ్ హిట్ కొట్టాడని.. కానీ బాలయ్య సోలోగా ‘వీరసింహారెడ్డి’ని సక్సెస్ చేశాడని.. అందుకే ఆయనే గ్రేట్ అనే రకంగా ఫీలవుతున్నారు.

ఈ ఉద్దేశంతోనే ఇలా పోస్టర్లు వేశారు. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలను నిర్మించింది ఒకే నిర్మాణ సంస్థ.. మైత్రీ మూవీ మేకర్స్. వాళ్లు రిలీజ్ టైంలో ఈ గొడవలు తగ్గించేందుకు చేయాల్సిందంతా చేశారు. అయినా ఫ్యాన్స్ తగ్గలేదు. ఇప్పుడు మైత్రీ వారు ఇన్‌కమ్ ట్యాక్స్ గొడవల్లో ఉండగా.. బాలయ్య అభిమానులే చొరవ తీసుకుని ఇలా పోస్టర్లు వేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ పోస్టర్లను సిటీలో చిరు ఫ్యాన్స్ అక్కడక్కడా చించి పడేస్తుండటం గమనార్హం.

This post was last modified on April 19, 2023 5:59 pm

Share

Recent Posts

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

1 hour ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

2 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

2 hours ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

2 hours ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

3 hours ago

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

3 hours ago