కరోనా వల్ల సినిమా థియేటర్లు మూసి పెట్టడంతో ఓటిటిలోనే చాలా సినిమాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఎంతగా జనం ఇళ్లల్లోనే ఉంటూ సినిమాలు టీవీలోనే చూస్తున్నా కానీ ఓటిటిలో వచ్చిన ప్రతి సినిమాను ఎగబడి చేసేయడం లేదు. ఇంకా చెప్పాలంటే రివ్యూస్ బాగుండి, సోషల్ మీడియాలో బాగా మాట్లాడుకుంటున్న సినిమాలను మాత్రమే చూస్తున్నారు.
ఈ థియేటర్ లాక్ డౌన్ టైంలో బాలీవుడ్ నుంచి పలు చిత్రాలు రిలీజ్ కాగా సుశాంత్ సింగ్ నటించిన దిల్ బేచారాకు తప్ప మిగతా ఏ సినిమాలకూ ఆదరణ దక్కలేదు. దిల్ బేచారా అయినా సుశాంత్ సింగ్ కి ఉన్న సింపతీ ఫాక్టర్ వల్ల అలా రికార్డు వ్యూస్ దక్కించుకుంది. కాకపోతే ఇంకా అగ్ర హీరోలు నటించిన చిత్రాలేమీ విడుదల కాలేదు.
అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ నటించిన సినిమాలు వస్తే ఓటిటి సీన్ మన దేశంలో ఎంత ఉందనేది తెలిసిపోతుంది. కాకపోతే సినిమాల కంటే సిరీస్ చూడ్డానికి ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సిరీస్ మీద దర్శకులు, నిర్మాతలు కూడా ఫోకస్ పెడుతున్నారు.