Movie News

నాని ‘జెర్సీ’కి అరుదైన గౌరవం

థియేటర్లలో ఎంత బాగా ఆడింది.. బాక్సాఫీస్ కొలమానాల్లో ఎక్కడ నిలుస్తుంది అన్నది పక్కన పెడితే.. గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి అనడంలో సందేహం లేదు. తెలుగులో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం కూడా ఇదే అనడంలో మరో మాట లేదు. కొన్ని సినిమాలు వస్తాయి. ఆడతాయి. వెళ్లిపోతాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. కాలం గడిచేకొద్దీ కల్ట్ స్టేటస్ అందుకుంటాయి. ‘జెర్సీ’ అలాంటి సినిమానే.

ఈ చిత్రానికి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ‘జెర్సీ’ చిత్రం ఎంపికైంది. ఈ ఫిలిం ఫెస్టివల్లో ఓ తెలుగు చిత్రానికి అవకాశం దక్కడం అరుదైన విషయమే.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 9 నుంచి, 15 వరకు కెనడాలో ఈ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించనున్నారు. హిందీ సహా వివిధ భారతీయ భాషల్లో అత్యుత్తమ చిత్రాల్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేనర్ యువ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా.. సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం అందించాడు. విడుదలైనపుడు ఓ మోస్తరు విజయమే సాధించింది కానీ.. తర్వాత ‘జెర్సీ’ మాస్టర్ పీస్‌గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ కూడా ఈ సినిమా గొప్పదనాన్ని గుర్తించింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుతో కలిసి కరణ్ జోహార్‌ ‘జెర్సీ’ పేరుతోనే ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఆ చిత్రానికి హిందీలోనూ గౌతమ్ తిన్ననూరినే రూపొందిస్తున్నాడు.

This post was last modified on August 2, 2020 9:20 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

12 hours ago