వెండి తెర మీద వర్షం పాటలుచూస్తున్నప్పుడు కలిగే కిక్కు అంతా ఇంతా అన్నట్లు ఉంది. చూసే వారికి బాగానే ఉన్నా.. దాన్ని రియల్ గా చేసే వారికి ఉండే కష్టాలు అన్ని ఇన్ని కావు. అందునా రొమాంటిక్ మూడ్ లో సాగే.. వర్షం పాటను పూర్తిచేసే వేళలో హీరోయిన్స్ కు ఎదురయ్యే ఇబ్బందులు అన్నిఇన్ని కావు. తాజాగా అవెంత కష్టంగా ఉంటాయన్న విషయాన్ని సీనియర్ నటి శోభన తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా వెల్లడించారు.
నాగార్జున మొదటి సినిమా ‘విక్రమ్’.. శోభన తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటి అగ్రహీరోలతో వరుస పెట్టి సినిమాలుచేసిన ఆమె.. తమిళ.. మలయాళ..హిందీ సినిమాల్లోనూ తన ముద్రను వేసింది. నటిగానే కాదు.. క్లాసికల్ డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఈ సందర్భంగా సినిమా కష్టాలు ఎంతలా ఉంటాయో చెప్పిన తీరు చదివాక.. ఆశ్చర్యపోవాల్సిందే.
రజనీకాంత్ తో తాను శివ.. దళపతి సినిమాల్ని చేశానని.. శివ మూవీ షూట్ లో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని చెప్పుకొచ్చారు. “ఆ రోజు షూట్ లో వర్షం పాటను షూట్ చేయటానికి సెట్ వేశారు. నాకు తప్పించి అందరికి ఆ విషయం తెలుసు. శరీరం కనిపించేలా ఉన్న ఒక తెల్ల చీరను ఇచ్చి కట్టుకోమన్నారు. చీర చూస్తే చాలా పల్చగా ఉంది. లోపల ఏదైనా వేసుకోవటానికి వీలుగా ఇంటికి వెళ్లి వస్తానని చెప్పా. ఇంటికి వెళ్లి వచ్చేంత టైం లేదు. దీంతో ఏంచేయాలో తోచలేదు. షూట్ కు రమ్మంటున్నారు. దీంతో.. ఏం చేయాలో తోచక.. అక్కడే ఉన్న ఒక టేబుల్ కవర్ ను ఒంటికి చుట్టుకొని దాని మీద చీర కట్టుకొని షూట్ కు రెఢీ అయ్యా” అని తనకు ఎదురైన ఒక అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ఆ రోజు తాను ప్లాస్టిక్ షీట్ కట్టుకొని షూట్ కు వెళ్లానన్న విషయం ఎవరికీ తెలీదన్నారు.
ఆ పాటను షూట్ చేస్తున్న వేళలో.. డ్యాన్స్ చేస్తున్నప్పుడు కవర్ శబ్ధంతో రజనీకాంత్ బాగా ఇబ్బంది పడ్డారని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వాన పాటల్లో హీరోయిన్లు నటించటం ఎంత కష్టమైన విషయమో చెబుతూ.. ‘వాన పాటలు చేయటం అంటే.. హీరోయిన్ ను మర్డర్ చేసినట్లే’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించటం గమనార్హం. సినిమాల తర్వాత కళార్పణ అనే సంస్థను ఏర్పాటు చేసిన శోభన.. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. దాదాపుగా పన్నెండేళ్ల క్రితం ఒక పాపను దత్తత తీసుకొన్నారు.
This post was last modified on April 16, 2023 9:42 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…