సీనియర్ హీరోల పక్కన హీరోయిన్లను సెట్ చేయడం పెద్ద సమస్యగా మారుతోంది ఈ రోజుల్లో. ఒకప్పట్లా తమ వయసులో సగం అంత కంటే ఎక్కువ వయసు అంతరం ఉన్న హీరోయిన్లతో సీనియర్లు రొమాన్స్ చేస్తే ప్రేక్షకులు ఈజీగా తీసుకోవట్లేదు. మరీ చిన్న వయసు హీరోయిన్లతో సీనియర్లు జట్టు కడితే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో వీలైనంత మేర హీరోయిన్లలోనూ కాస్త సీనియారిటీ ఉన్న వాళ్లనే ఎంచుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆయన దర్శకులు ఇలా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు.
పవన్ ఏమీ చిరంజీవి తరం సీనియర్ కాకపోయినా.. పవన్ కూడా 50 ప్లస్ వయసులో ఉన్న వాడే. అలాంటపుడు మరీ యంగ్ హీరోయిన్లను ఆయన పక్కన నటింపజేస్తే కొంచెం ఆడ్‌గానే ఉంటుంది. కానీ మేకర్స్ ఇలా ఆలోచించట్లేదు.
ఆల్రెడీ ‘హరిహర వీరమల్లు’లో పవన్‌కు జోడీగా నటిస్తున్న నిధి అగర్వాల్‌తో ఆయనకు జోడీ కుదురుతుందా అన్న సందేహాలున్నాయి. నిధి పవన్ పక్కన కాస్త చిన్నగానే అనిపించే అవకాశాలున్నాయి. ఇదే ఆడ్ పెయిర్ అనుకుంటే.. ఇప్పుడు కేవలం 21 ఏళ్ల వయసున్న శ్రీలీలను పవన్ పక్కన నటింపజేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం పవర్ స్టార్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో శ్రీలీల ఓ కథానాయికగా నటిస్తుందన్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ రోజే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
శ్రీలీలను ‘ఉస్తాద్..’ సెట్లోకి హరీష్ శంకర్ ఆహ్వానిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పవన్ పక్కన శ్రీలీలను ఊహించుకుని ఆ పెయిర్ ఎలా ఉంటుందో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పవన్ చేయబోయే ‘ఓజీ’కి సైతం ఒక యంగ్ హీరోయిన్నే తీసుకుంటున్నారు. ఇందులో ‘గ్యాంగ్ లీడర్’ భామ ప్రియాంక మోహన్ నటించనుందట. ఆమె కూడా పవన్ పక్కన కాస్త చిన్నగానే అనిపించవచ్చు. సమంత, కాజల్, తమన్నా లాంటి వాళ్లు ఔట్ డేట్ అయిపోయినా.. ఆల్రెడీ సీనియారిటీ సంపాదించిన పూజా హెగ్డే, రాశి ఖన్నా లాంటి వాళ్లయితే పవన్ పక్కన బాగుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates