దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన హీరోయిన్లు.. ఇక్కడి పరిశ్రమల గురించి తక్కువ చేసి మాట్లాడటం కొత్తేమీ కాదు. ఇలియానా, తాప్సి పన్ను లాంటి వాళ్లే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ ఉన్నన్నాళ్లూ పారితోషకాల ఆశతో నో చెప్పకుండా అన్ని రకాల వేషాలూ ఒప్పుకుంటారు. తీరా బాలీవుడ్లో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ పడితే.. టాలీవుడ్, కోలీవుడ్ తమ ప్రతిభను గుర్తించలేదని ఏడుస్తారు. అంతటితో ఆగకుండా ఇక్కడి హీరోలు అలాంటి వాళ్లు ఇలాంటి వాళ్లు అని కామెంట్లు చేయడమూ మామూలే.
తాజాగా ఇలియానా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. టాలీవుడ్లో నెపోటిజం ఛాయలు ఎక్కువ అన్న ఆమె.. ఇక్కడ అవకాశాల పేరుతో అమ్మాయిల్ని లోబరచుకోవడమూ ఎక్కువే అంది. తెలుగు పరిశ్రమలోని కొందరు అగ్ర హీరోలు, నిర్మాతలు.. హీరోయిన్ల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు అందరినీ కోరిక తీర్చమని.. లేకుంటే అవకాశాలు రావని అంటారని ఇలియానా కామెంట్ చేసినట్లుగా వార్తలు కనిపిస్తున్నాయి.
కొందరు అగ్ర హీరోలు సెక్స్ కావాలని నేరుగానే అడుగుతారని ఆమె అంది. ఓ కొత్త హీరోయిన్ తన దగ్గరికి వచ్చి.. అవకాశం కావాలంటే దర్శకుడు, హీరోతో పడుకోవాలట.. మరి ఏం చేయమంటారు అని తనను అడిగినట్లుగా ఇలియానా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐతే తన వరకు అలాంటి సమస్యలు లేవని.. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిసి జాగ్రత్త పడ్డానని ఆమె అంది. ఈ విషయంలో ఏం చేయాలో నీదే నిర్ణయం అంటూ ఆ హీరోయిన్‌కు తాను చెప్పినట్లు ఇలియానా వెల్లడించింది.
బయటికి తెలిస్తే పరువు పోతుందని చాలామంది చెప్పట్లేదు కానీ.. అవకాశాల పేరుతో అగ్ర హీరోలు కూడా సెక్స్ కావాలని నేరుగా అడుగుతారని ఆమె అంది. మి టూ ఉద్యమంలో భాగంగా అత్యధిక ఆరోపణలు వచ్చిన బాలీవుడ్ గురించి ఏమీ మాట్లాడకుండా ఇలియానా టాలీవుడ్ మీద ఇలా ఆరోపణలు చేయడం ఆశ్చర్యమే. పైగా టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలొస్తున్న సమయంలో ఇదేంటో?
This post was last modified on August 2, 2020 9:54 am
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…