Movie News

‘నాని 30’కి మృణాల్ ఎలివేషన్

నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమాతో వేరే లెవెల్‌కు వెళ్లిపోయాడు. ఇన్నాళ్లూ మిడ్ రేంజ్ స్టార్‌గా ఉన్న అతను.. ‘దసరా’తో టాప్ లీగ్ హీరోలకు కొంచెం దగ్గరగా వెళ్లాడు. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లు అన్నీ కూడా పెద్ద రేంజిలోనే ఉండటం పట్ల నాని చాలా హ్యాపీగా ఉన్నాడు.

ఐతే నాని వరుసగా చేసే ఏ రెండు సినిమాలూ ఒకేలా లేకుండా చూసుకుంటాడన్న సంగతి తెలిసిందే. ‘దసరా’ లాంటి ఊర మాస్ సినిమా తర్వాత అతను.. పక్కా క్లాస్ సినిమా చేయబోతున్నాడు. గతంలో మైత్రీ మూవీ మేకర్స్‌లో భాగస్వామిగా ఉన్న మోహన్ నిర్మాణంలో శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో నాని తన 30వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాని ఆరేళ్ల పాపకు నాన్నగా నటించనున్నాడు. ఈ సినిమా టీజర్ చూస్తేనే ఇదొక హృద్యమైన సినిమా అనే విషయం అర్థమైంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న ‘సీతారామం’ భామ మృణాల్ ఠాకూర్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని 30 గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తన కెరీర్లో ఇప్పటిదాకా చదివిని బెస్ట్ స్క్రిప్ట్ ఇదే అంటూ ‘నాని 30’కి మాంచి ఎలివేషన్ ఇచ్చింది మృణాల్. ‘సీతారామం’ తర్వాత బాగా టైం తీసుకుని ఈ సినిమా చేయడం గురించి ఆమె స్పందిస్తూ.. ‘‘సీతారామం తర్వాత తెలుగులో అవకాశాల కోసం చూశాను. కొందరు పెద్ద దర్శక నిర్మాతలను కూడా కలిశాను. ఐతే అందరూ కూడా నా కోసం సీతారామం కంటే మంచి పాత్ర రాయాలంటే కొంచెం సమయం పడుతుంది అన్నారు. అందుకే ‘సీతారామం’ తర్వాత కొత్త సినిమా ఒప్పుకోవడానికి ఆరు నెలలు పట్టింది. నానితో నా తర్వాతి సినిమా చేయడం చాలా సంతోషం. నా జీవితంలో ఇప్పటిదాకా అంత మంచి స్క్రిప్టు చదవలేదు’’ అని మృణాల్ పేర్కొంది.

ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా.. ‘దసరా’ ప్రమోషన్ల కోసం కొంచెం గ్యాప్ తీసుకున్న నాని.. త్వరలోనే రెండో షెడ్యూల్‌కు రానున్నాడు. గోవాలో 40 రోజుల పాటు సుదీర్ఘంగా సాగే షెడ్యూల్‌లో మేజర్ టాకీ పార్ట్ పూర్తి చేయనున్నారట.

This post was last modified on April 6, 2023 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

10 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

10 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

11 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

12 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

12 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

13 hours ago